పవన్‌ కల్యాణ్‌ 'ఓజీ'లో శిరీష.. నారా రోహిత్‌ క్లారిటీ | Nara Rohith Comments On Pawan Kalyan OG Movie And His Wife Shireesha Role, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

పవన్‌ కల్యాణ్‌ 'ఓజీ'లో శిరీష.. నారా రోహిత్‌ క్లారిటీ

May 29 2025 8:33 AM | Updated on May 29 2025 8:56 AM

Nara Rohith Comments On OG Movie And His Wife Shireesha Play Best Role

పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'ఓజీ'లో శిరీష లేళ్ల ఛాన్స్‌ దక్కించుకుంది. ఇదే విషయాన్ని అధికారికంగా ఆమెకు కాబోయే భర్త నారా రోహిత్‌ తాజాగా ప్రకటించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఓజీ సినిమా గురించి మాట్లాడారు. 'ప్రతినిధి2' చిత్రంలో నారా రోహిత్‌ సరసన శిరీషా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రేమలో పడిన వారిద్దరూ గతేడాదిలో నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలో వివాహం కానుంది.

'భైరవం' సినిమా మే 30న విడుదల కానుంది. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్‌ నటించారు. మూవీ ప్రమోషన్స్‌ కార్యక్రమంలో భాగంగా ఈ ముగ్గురితో హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ఒక ఇంటర్వ్యూ చేశారు. ఓజీ అప్డేట్‌ ఇవ్వాలంటూ రోహిత్‌ను ప్రశ్నించగా ఇలా చెప్పారు. 'ఓజీలో నాకు కాబోయే సతీమణి శీరీషా కూడా నటించారు. ఒక కీలకమైన పాత్రలో నటించే ఛాన్స్‌ ఆమెకు దక్కింది' అని ఆయన అన్నారు. ప్రస్తుతం రోహిత్‌ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

‘ఓజీ’ సినిమా షూటింగ్‌ స్పీడ్‌గానే సాగుతుంది. ఈ చిత్రంలో ప్రియాంకా మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇమ్రాన్‌ హష్మి ఓ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. సుజిత్‌ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోందని సమాచారం. ఈ ఏడాది సెప్టెంబరు 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. తమన్‌ సంగీతం అందించారు. శ్రియా రెడ్డి, అర్జున్‌ దాస్‌లతో పాటు శిరీషా కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement