
మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'భైరవం'. గతేడాది డిసెంబరు నుంచి రిలీజ్ మాట వినిపిస్తుంది. మరి కారణాలేంటో తెలీదు గానీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈనెల 30న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: ఈ హీరోని గుర్తుపట్టారా? మహేశ్ కి బంధువు, స్టేట్ ప్లేయర్ కూడా)
ముగ్గురు హీరోల సీన్స్ తో పాటు అటు యాక్షన్, ఇటు ఫ్యామిలీ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసేలా ట్రైలర్ కట్ చేశారు. చూస్తుంటే సినిమా వర్కౌట్ అయ్యేలా ఉంది. ఇందులో ఆనంది, దివ్య పిళ్లై, అదితీ శంకర్ హీరోయిన్లుగా నటించారు.
ఇది తమిళ సినిమా 'గరుడన్'కి రీమేక్. ట‍్రైలర్ చూస్తుంటే తెలుగు ఫ్లేవర్ కి తగ్గట్లే సన్నివేశాల్లో చిన్న చిన్న మార్పులు చేసినట్లు అనిపించింది. 'నాంది' ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించాడు. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో కొన్నిరోజుల్లో తెలుస్తుంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్)