ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్ | Lovedale Movie OTT Telugu Streaming Now | Sakshi
Sakshi News home page

OTT Movie: మలయాళ మూవీ.. ఇప్పుడు ఓటీటీలో తెలుగులో రిలీజ్

May 18 2025 2:38 PM | Updated on May 18 2025 3:23 PM

Lovedale Movie OTT Telugu Streaming Now

ఈ వీకెండ్ ఓటీటీల్లో దాదాపు 25కి పైగా కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజయ్యాయి. మరికొన్ని సడన్ స్ట్రీమింగ్ అయ‍్యాయి. అలాంటి వాటిలో 'లవ్ డేల్' అనే సస్పెన్స్ థ్రిల్లర్ ఒకటి. పేరుకే మలయాళ సినిమా అయినప్పటికీ ఇప్పుడు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులో రిలీజైంది?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి కన్నడ మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్) 

ఫిబ్రవరిలో మలయాళంలో థియేటర్లలో రిలీజైన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'లవ్ డేల్'. కాస్త హారర్ టచ్ ఇచ్చిన ఈ మూవీలో అందరూ కొత్త నటీనటులే ఉండటంతో ఓ మాదిరి రెస్పాన్స్ మాత్రమే సొంతం చేసుకుంది. ఇప్పుడీ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ యూకేలో స్ట్రీమింగ్ లోకి వచ్చింది.

ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో మన దగ్గర కూడా అందుబాటులోకి రానుంది. 'లవ్ డేల్' అనేది ఊటీలోని ఓ ఊరి పేరు. ఈ మూవీ విషయానికొస్తే మోడల్ కమ్ ఫొటోగ్రాఫర్ అయిన ఓ అమ్మాయి.. తన ఫ్రెండ్స్ తో కలిసి ఈ ఊరికి వస్తుంది. ఓ బంగ్లాలో వీళ్లంతా ఉంటారు. కానీ ఓ రోజు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. ఇంతకీ వీళ్లని చంపుతున్నది ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి కల్యాణ్ రాణ్ కొత్త సినిమా) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement