
రీసెంట్ టైంలో ప్రతి భాషలోనూ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాల్ని తీస్తున్నారు. చాలా వరకు అవి హిట్ అవుతున్నాయి. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి కూడా. అలా ఇప్పుడు కన్నడ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. స్ట్రీమింగ్ తేదీని ఫిక్స్ చేశారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎప్పుడు రిలీజ్ కానుంది?
సాధారణంగా థ్రిల్లర్స్ అంటే ఎక్కువగా మలయాళ ఇండస్ట్రీ పేరు వినిపిస్తుంది. తాజాగా కన్నడ చిత్రసీమ నుంచి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ 'అజ్ఞాతవాసి'. ఏప్రిల్ 11న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. ప్రశంసలతో పాటు మంచి కలెక్షన్స్ కూడా అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని జీ5 ఓటీటీలోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి కల్యాణ్ రాణ్ కొత్త సినిమా)
మే 28 నుంచి కన్నడతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు. 25 ఏళ్లుగా అసలు నేరాలే జరగని ఓ ఊరిలో అనుమానాస్పద రీతిలో ఓ వ్యక్తిని చంపేస్తే ఏమైందనే కాన్సెప్ట్ తో 'అజ్ఞాతవాసి' తీశారు. థ్రిల్లర్స్ అంటే ఆసక్తి ఉంటే దీన్ని అస్సలు మిస్ కావొద్దు.
అజ్ఞాతవాసి విషయానికొస్తే.. ఓ ఊరిలో గత 25 ఏళ్లుగా ఒక్క క్రైమ్ కూడా జరగదు. అలాంటి ఊరికి గోవిందు అనే పోలీస్.. బదిలీపై వస్తాడు. అంతా ప్రశాంతంగా ఉంది అనుకున్న టైంలో ఊరి పెద్ద హత్యకు గురవుతాడు. పంకజ, రోహిత్, శ్రీనివాసయ్య అనే ముగ్గురిపై గోవిందు అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇంతకీ హంతకుడు ఎవరు? 1970లో ఇదే ఊరిలో జరిగిన సంఘటనకు ఈ హత్యకు సంబంధమేంటి? అనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి :రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు)