
ఒకే సినిమా రెండు మూడు ఓటీటీల్లోనూ రిలీజ్ అయిన సందర్భాలు అడపాదడపా ఉండనే ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్టులోకి చేరిపోయింది లేటెస్ట్ తెలుగు మూవీ. కల్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రలు చేసిన ఈ మూవీ ఇప్పటికే ఒకదానిలో రిలీజ్ కాగా.. ఇప్పుడు మరో దానిలోకి కూడా రాబోతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.
కల్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. రిలీజ్ కి ముందు చాలా హడావుడి చేశారు గానీ సినిమాలో అంత సీన్ లేకపోయేసరికి ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. కట్ చేస్తే థియేటర్లలోకి వచ్చిన నెలలోపే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు (మే 16) నుంచి అందుబాటులోకి వచ్చింది.
(ఇదీ చదవండి: 'బిగ్ బాస్'తో బలుపు పెరిగింది.. నా ఫ్రెండ్సే నన్ను..: సొహెల్)
ఇప్పుడు ఆహా ఓటీటీలోనూ వచ్చే శుక్రవారం (మే 23) నుంచి స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. తల్లికొడుకుల బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ ఎమోషనల్ డ్రామా మరి ఓటీటీలో ఏ మేరకు రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి?
అర్జున్ సన్నాఫ్ వైజయంతి విషయానికొస్తే.. వైజయంతి (విజయశాంతి) సిన్సియర్ పోలీసాఫీసర్. ఈమె కొడుకు అర్జున్ కూడా పోలీస్ అయ్యేందుకు కష్టపడుతుంటారు. కానీ ఓ సందర్భంలో తన తండ్రిని చంపిన హంతకుడిని అందరూ చూస్తుండానే అర్జున్ చంపేస్తాడు. దీంతో తల్లికొడుకుల మధ్యం దూరం పెరుగుతుంది. మరి వీళ్లిద్దరూ కలిశారా? చివరకు ఏమైందనేదే స్టోరీ.
(ఇదీ చదవండి :రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు)
