
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలో 'ఎలెవన్' అనే చిన్న సినిమా తప్పితే చెప్పుకోదగ్గ రిలీజులు ఏం లేవు. మరోవైపు ఓటీటీలో మాత్రం 24 కొత్త మూవీస్-వెబ్ సిరీసులు వచ్చేశాయి. ఇవన్నీ రెండు రోజుల్లోనే స్ట్రీమింగ్ కావడం విశేషం.
(ఇదీ చదవండి: డేటింగ్‌లో సమంత.. స్పందించిన మేనేజర్)
ఓటీటీల్లోకి వచ్చిన వాటిలో మరణమాస్, అర్జున్ సన్నాఫ్ వైజయంతి, గేంజర్స్, జాలీ ఓ జింఖానా చిత్రాలు ఉన్నంతలో చూడదగ్గవి. ఇవి కాకుండా మరికొన్ని ఇంగ్లీష్, హిందీ మూవీస్ కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలోకి ఏ మూవీ వచ్చిందంటే?
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన సినిమాలు (మే 16)
అమెజాన్ ప్రైమ్
అర్జున్ సన్నాఫ్ వైజయంతి - తెలుగు మూవీ
భోల్ చుక్ మాఫ్ - హిందీ సినిమా
ఏ వర్కింగ్ మ్యాన్ - తెలుగు డబ్బింగ్ మూవీ
గేంజర్స్ - తెలుగు డబ్బింగ్ సినిమా
లవ్ ఆఫ్ రెప్లికా సీజన్ 1 - చైనీస్ సిరీస్
వైట్ ఔట్ - ఇంగ్లీష్ మూవీ (రెంట్)
వన్ ఆఫ్ దెమ్ డేస్ - ఇంగ్లీష్ సినిమా
సలాటే సలనాటే - మరాఠీ మూవీ
వన్ లైఫ్ - ఇంగ్లీష్ సినిమా
మనడ కడలు - కన్నడ మూవీ
సోనీ లివ్
మరణమాస్ - తెలుగు డబ్బింగ్ సినిమా
నెట్ ఫ్లిక్స్
ద క్విల్టర్స్ - ఇంగ్లీష్ మూవీ
బెట్ - తెలుగు డబ్బింగ్ సిరీస్
ఐ సా ద టీవీ గ్లో - ఇంగ్లీష్ మూవీ
జానెట్ ప్లానెట్ - ఇంగ్లీష్ సినిమా
సాసాకీ అండ్ పీప్స్ - జపనీస్ సిరీస్
వినీ జూనియర్ - పోర్చుగీస్ మూవీ
హాట్ స్టార్
డస్టర్ - ఇంగ్లీష్ సిరీస్
హే జునూన్ - హిందీ సిరీస్
వుల్ఫ్ మ్యాన్ - ఇంగ్లీష్ మూవీ (మే 17)
సన్ నెక్స్ట్
నెసిప్పయ - తమిళ మూవీ
ఆపిల్ ప్లస్ టీవీ
డియర్ ప్రెసిడెంట్ నౌ - ఇంగ్లీష్ సినిమా
మర్డర్ బాట్ - ఇంగ్లీష్ సిరీస్
ఆహా
జాలీ ఓ జింఖానా - తెలుగు డబ్బింగ్ సినిమా
(ఇదీ చదవండి: 'పద్మ భూషణ్' చేయాల్సిన పనులేనా..? బాలకృష్ణపై విమర్శలు)