
సౌత్ ఇండియా పాపులర్ నటి సమంత డేటింగ్‌లో ఉన్నారని జరుగుతున్న ప్రచారంపై తన మేనేజర్ స్పందించారు. తాజాగా తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌లో నిర్మించిన తొలి సినిమా ‘శుభం’ (Subham) విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సమంత అతిథి పాత్రలో నటించారు. మూవీ విడుదల సమయంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఆ చిత్ర యూనిట్‌తో పాటు దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత కలిసి దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. రాజ్- సమంత ఇటీవల తరచూ ఒకే చోట కనిపించడంతో కొద్దిరోజులుగా రూమర్స్ వచ్చాయి. తాజా ఫొటోతో నెట్టింట మళ్లీ చర్చ మొదలైంది. వారు డేటింగ్‌లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ రూమర్స్‌పై సమంత మేనేజర్ స్పందించారు.
డైరెక్టర్ రాజ్ నిడమోరుతో సమంత డేటింగ్ చేస్తున్నారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మేనేజర్ అన్నారు. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనంటూ తెలిపారు. సమంత నిర్మించిన శుభం సినిమా ప్రమోషన్స్ సమయంలో తీసిన ఫోటోలను ఇలా తప్పుడు వార్తలకు లింక్ చేస్తూ వైరల్ చేస్తున్నారని పేర్కొన్నారు. రాజ్ తన కూతురితో పాటు సమంతతో కలిసి ఉండాలని అనుకుంటున్నాడని వచ్చిన ప్రచారం పూర్తిగా అవాస్తవమని అన్నారు. అసలు ఆయనకు కూతురే లేదన్నారు. తనతో పాటు ఉన్న అమ్మాయి కోడైరెక్టర్ కృష్ణ డీకే కూతురని చెప్పుకొచ్చారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసి ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దని సమంత మేనేజర్ కోరారు.