
‘‘నేను, మనోజ్, రోహిత్‌గార్లు సినిమాలకి కొంతకాలం బ్రేక్ ఇచ్చాం. తెలుగులో నా సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్లవుతోంది. ‘భైరవం’ చిత్రంలో మాపాత్రలు చూస్తున్నప్పుడు అందరూ ఫ్రెష్‌గా ఫీల్ అవుతారు’’ అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలిపారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన చిత్రం ‘భైరవం’. సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా అదితీ శంకర్, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్లుగా నటించారు.
డా. జయంతిలాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో సాయి శ్రీనివాస్ విలేకరులతో పంచుకున్న విశేషాలు...
⇒ తమిళ హిట్ మూవీ ‘గరుడన్’ని తెలుగులో ‘భైరవం’గా రీమేక్ చేశాం. అయితే రీమేక్‌లా కాకుండా స్ట్రైట్ తెలుగు చిత్రంలా మన ప్రేక్షకులకు తగ్గట్టు మార్పులు చేసి, అద్భుతంగా తీర్చిదిద్దారు విజయ్. ఈ కథ,పాత్ర నచ్చడంతో రోహిత్‌గారు వెంటనే అంగీకరించారు. ‘మిరాయ్’ సినిమా పోస్టర్లో మనోజ్‌గారిని చూసి, ‘భైరవం’పాత్రకి సంప్రదించగా, కథ నచ్చడంతో ఒప్పుకున్నారు.
⇒ నన్ను ఇష్టపడిన ప్రతి ప్రేక్షకుడి కోసం ‘భైరవం’ చేశాను. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు మంచి అనుభూతినిస్తుంది. శ్రీ చరణ్‌పాకాల అద్భుతమైన సంగీతం, నేపథ్య సంగీతం ఇచ్చారు. హరి కె. వేదాంతంగారి విజువల్స్ కొత్త అనుభూతిని ఇస్తాయి. ఈ సినిమా కోసం అద్భుతమైన ఆలయ సెట్ వేసిన ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలిగారికి థ్యాంక్స్. ఈ సినిమా ట్రైలర్లో పూనకం షాట్ ఉంటుంది. అందరూ చూసే ఉంటారు. ‘భైరవం’లో నాకు బాగా నచ్చినపార్ట్ అది. ఆపార్ట్‌ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే సినిమా ఇది.
⇒ రాధామోహన్‌గారు నాకిష్టమైన నిర్మాత. ఆయనతో రెండు మూడు ప్రాజెక్టులు అనుకున్నా కుదరలేదు. ‘భైరవం’తో సెట్ అయింది. చాలా ఫ్యాషన్‌తో సినిమా నిర్మిస్తారాయన.
⇒ పూరి జగన్నాథ్‌గారిని ఒకటి రెండు సార్లు కలిశాను. మా కాంబోలో కచ్చితంగా సినిమా ప్లాన్ చేస్తాం. నా ప్రతి సినిమాలో కొత్తదనం ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. విడుదలవుతున్న ‘భైరవం’, ప్రస్తుతం చేస్తున్న ‘టైసన్ నాయుడు, హైందవ, కిష్కిందపురి’ చిత్రాలు వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి.