మగధీర సినిమా చూశాకే హీరోయిన్ అవ్వాలనుకున్నా: ఆదితి శంకర్ | Kollywood actress Aditi Shankar about Ram Charan Magadheera Movie | Sakshi
Sakshi News home page

Aditi Shankar: 'థియేటర్లో చూసిన మొదటి టాలీవుడ్ సినిమా.. గూస్‌బంప్స్‌ వచ్చాయన్న ఆదితి శంకర్'

May 20 2025 8:36 PM | Updated on May 20 2025 8:45 PM

Kollywood actress Aditi Shankar about Ram Charan Magadheera Movie

కోలీవుడ్ బ్యూటీ ఆదితి శంకర్ తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. భైరవం మూవీతో టాలీవుడ్‌ సినీ ప్రియులను మెప్పించనుంది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, నారా రోహిత్, మంచు మనోజ్‌ హీరోలుగా నటించారు. ఈ చిత్రంలో ఆదితితో పాటు  ఆనంది, దివ్య పిళ్లై కూడా హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇటీవల ట్రైలర్‌ లాంఛ్‌ ఈవెంట్‌కు హాజరైన ఆదితి శంకర్‌ తన స్టెప్పులతో వేదికపై అలరించింది. ఈ ఈవెంట్‌లో సెంటర్ ఆఫ్ ‍అట్రాక్షన్‌గా నిలిచింది. ప్రస్తుతం భైరవం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూకు హాజరైంది.

ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది ముద్దుగుమ్మ. టాలీవుడ్‌ సినిమాల్లో మొదట థియేటర్లో చూసిన మూవీ మగధీర అని తెలిపింది. ఈ సినిమా చూశాకా గూస్‌బంప్స్‌ వచ్చేలా ఉందని తన ఆనందం వ్యక్తం చేసింది. మగధీర మూవీ చూశాకే హీరోయిన్ అవ్వాలని డిసైడ్ ‍అయ్యానని ఆదితి శంకర్ తెలిపింది.

(ఇది చదవండి: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌.. స్టేజీపై డ్యాన్స్‌తో అదరగొట్టిన హీరోయిన్!)

కాగా.. అంతకు ముందు హీరోయిన్ ఆదితి శంకర్‌ తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరైన ముద్దుగుమ్మ.. వేదికపై స్టెప్పులతో అభిమానులను అలరించింది. ఓ వెన్నెల అంటూ సాగే పాటకు తనదైన స్టైల్లో డ్యాన్స్ చేసి అక్కడున్న వారిని మెప్పించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement