పడవలు సిద్ధం! | Suniel Shetty, Arjun join Mohanlal's Marakkar movie | Sakshi
Sakshi News home page

పడవలు సిద్ధం!

Nov 30 2018 6:00 AM | Updated on Nov 30 2018 6:00 AM

Suniel Shetty, Arjun join Mohanlal's Marakkar movie - Sakshi

ప్రియదర్శన్‌

పెద్ద పెద్ద పడవలను రెడీ చేస్తున్నారు మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌. ఆల్రెడీ కొన్ని పడవలను సిద్ధం చేశారు కూడా. ఆయన కొత్త వ్యాపారం ఏం మొదలుపెట్టలేదు. ‘మరాక్కర్‌–అరబ్బికడలింటే సింహం’ అనే సినిమా కోసమే ఇదంతా. మోహన్‌లాల్‌ టైటిల్‌ రోల్‌ చేయనున్న ఈ సినిమాలో అర్జున్, సునీల్‌ శెట్టి, ప్రణవ్‌ మోహన్‌లాల్, కీర్తీ సురేశ్, కల్యాణి ప్రియదర్శన్‌ కీలక పాత్రలు పోషించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ–ప్రొడక్షన్‌ వర్క్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి. ‘బాహుబలి’ ఫేమ్‌ సాబు శిరిల్‌ ఆధ్వర్యంలో సెట్‌ వర్క్‌ జరుగుతోంది. ఈ సెట్‌ ఫొటోలను సోషల్‌æమీడియాలో షేర్‌ చేశారు కల్యాణి ప్రియదర్శన్‌. అలాగే ఈ సినిమా షూటింగ్‌ అతి త్వరలో ప్రారంభం కానుందని పేర్కొన్నారామె. సముద్రపు దొంగల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందట. ఇప్పుడు అర్థం అయ్యింది కదా... దర్శకుడు ప్రియదర్శన్‌  పడవలను ఎందుకు తయారు చేస్తున్నారో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement