ముహూర్తం ఖరారైంది

pranav mohan lal 2nd film starts from july 9 - Sakshi

మలయాళంలో ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌ తనయుడు ప్రణవ్‌ మోహన్‌లాల్‌ హీరోగా నటించిన తొలి చిత్రం ‘ఆది’. తాజాగా ఆయన  రెండో చిత్రం ప్రారంభోత్సవం వచ్చే నెల 9న జరగనుందని మాలీవుడ్‌ సమచారం. అరుణ్‌ గోపీ దర్శకత్వం వహించనున్నారు. వివేక్‌ హర్షన్, హరినారాయణన్, రంగనాథ్, జోసెఫ్, ధన్య బాలకృష్ణన్, లిబిన్‌ మోహనన్‌ తదితరులు నటించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా వచ్చే నెలాఖర్లో స్టార్ట్‌ కానుందట. మరోవైపు ప్రియదర్శన్‌ దర్శకత్వంలో మోహన్‌లాల్‌ హీరోగా రూపొందనున్న మరార్కర్‌ సినిమాలో యంగ్‌ మోహన్‌లాల్‌ క్యారెక్టర్‌లో ప్రణవ్‌మోహన్‌లాల్‌ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ ఈ ఏడాది నవంబర్‌లో స్టార్ట్‌ కానుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top