2018లో రెండోసారి

Mohanlal at the launch of his son Pranav’s next Irupathiyonnam Noottandu - Sakshi

ఈ ఏడాది జనవరిలో ‘ఆది’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు మలయాళ నటుడు మోహన్‌లాల్‌ తనయుడు ప్రణవ్‌ మోహన్‌లాల్‌. ఈ సినిమాలో ప్రణవ్‌ నటన ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు ప్రణవ్‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘ఇరుపతియొన్నామ్‌ నూటాన్డు’. రీసెంట్‌గా ‘రామాలీలా’ సినిమాతో మాలీవుడ్‌కు దర్శకునిగా పరిచయం అయిన అరుణ్‌గోపీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ శనివారం మొదలైంది.

ఇందులో కల్యాణీ ప్రియదర్శని కథానాయికగా నటించనున్నారన్న వార్తలు కూడా గతంలో వచ్చాయి. ఈ సినిమాకు గోపీసుందర్‌ సంగీతం అందిస్తున్నారు. పీటర్‌ హెయిన్‌ యాక్షన్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. షూటింగ్‌ స్పీడ్‌గా జరిపి ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో రిలీజ్‌ చేయాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌. సో.. ఈ ఏడాది రెండోసారి ప్రణవ్‌ కనిపిస్తారన్న మాట. ఈ సినిమా కాకుండా తండ్రి మోహన్‌లాల్‌ హీరోగా నటించనున్న ‘మరార్కర్‌’ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు ప్రణవ్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top