మమ్ముట్టి, మోహన్‌లాల్ లీడ్ రోల్స్‌లో నటించిన మలయాళ చిత్రం ‘పేట్రియాట్’. నయనతార, ఫాహద్‌ఫాజిల్, కుంచకో బోబన్, రేవతి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మహేశ్ నారాయణన్ దర్శకత్వంలో ఆంటో జోసెఫ్, కేజీ అనిల్‌కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. దాదాపు 150 రోజుల పాటు ఈ మూవీ చిత్రీకరణ జరిగిందని సమాచారం.
హైదరాబాద్, విశాఖపట్నం, లండన్, శ్రీలంక, అజర్‌బైజాన్ వంటి లొకేషన్స్‌లో షూటింగ్ చేశారు. దేశభక్తి నేపథ్యంతో సాగే ఈ చిత్రంలో ఆర్మీ ఆఫీసర్‌గా మోహన్‌లాల్ నటించగా, ఓ సీక్రెట్ మిషన్‌ను టేకప్ చేస్తున్న వ్యక్తి పాత్రలో మమ్ముట్టి నటించారు. ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. ఇక 2008లో వచ్చిన ‘ట్వంటీ 20’ చిత్రం తర్వాత మోహన్‌లాల్, మమ్ముట్టి లీడ్ రోల్స్‌లో నటించిన ‘పేట్రియాట్’ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.


