
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ప్రస్తుతం కూలీ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. రజినీకాంత్ హీరోగా వస్తోన్న ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో టాలీవుడ్ హీరో నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో డైరెక్టర్ లోకేశ్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజా ఇంటర్వ్యూలో నాగార్జునను విలన్గా ఎంపిక చేయడంపై ప్రశ్న ఎదురైంది. ఎక్కువగా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ తీసే నాగార్జునను విలన్గా ఎలా తీసుకున్నారని లోకేశ్ను ప్రశ్నించారు. దీని వెనుక కారణాలను లోకేశ్ వివరించారు. తాను నాగార్జున సార్కు వీరాభిమానిని అని లోకేశ్ తెలిపారు. ఆయన సినిమాలు ఎక్కువగా చూస్తానని అన్నారు. విలన్గా ఒప్పించేందుకు చాలా రోజులు పట్టిందని ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశారు.
లోకేశ్ కనగరాజ్ మాట్లాడుతూ..' నేను కాలేజీకి వెళ్లే రోజుల్లోనే నాగార్జున సినిమాలు చూసేవాడిని. ఆయన నటించిన రక్షకుడు మూవీ తన ఫేవరేట్. ఆ సినిమాలో నాగ్ హెయిర్ స్టైల్ లుక్ తనను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత అదే స్టైల్లో కటింగ్ చేయించుకున్నా. శివ మూవీ కూడా చాలాసార్లు చూశా. గీతాంజలి, అన్నమయ్య లాంటి చిత్రాలకు ఫిదా అయిపోయా. కూలీ సినిమా కోసం నాగార్జునను ఒప్పించడం కోసం చాలా కష్టపడ్డాం. ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండని అడిగాను. దాదాపు ఏడుసార్లు నాగార్జున వెంటపడ్డాకే నాగ్ సార్ ఒప్పుకున్నారు.' అని తెలిపారు.
RB: నాగార్జున ని విలన్ గా ఎందుకు అనుకున్నావు ఫ్యామిలీ మూవీస్ తీసేవాడు కదా
Lokesh: నేను నాగార్జున సార్ కి పెద్ద ఫ్యాన్ ని నా కాలేజ్ డేస్ లో రక్షకుడు సినిమా చూసి ఫంక్ హైర్ స్టైల్ ఫాలో అయ్యే వాడిని శివ అంటే ఇష్టం
pic.twitter.com/QaVjYE7kqO— Яavindra (@Nag_chay_akhil) July 24, 2025