
రజనీకాంత్ సినిమా వస్తుందంటే చాలు ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లోనూ సంబరాలు మొదలవుతాయి. జపాన్, మలేషియా, సింగపూర్ లాంటి దేశాల్లో రజనీకాంత్‌కు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇక ఇండియాలో చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాక అంతటా ఆయనకు అభిమానులు ఉన్నారు. తొలి రోజు ఆయన సినిమా చూసేందుకు వేలల్లో ఖర్చు పెట్టిమరీ టికెట్ కొనేవాళ్లు చాలా మందే ఉన్నారు. సినిమా రిలీజ్ రోజు చాలా మంది ఉద్యోగస్తులు ఆఫీస్‌కి సెలవు పెడతారు. బాస్‌కి ఏదో ఒక కారణం చెప్పి ఆ రోజు ఆఫీస్‌కి డుమ్మా కొట్టేందుకు ప్రయత్నిస్తారు. ఇదంతా ఎందుకు అనుకుందో ఏమో కానీ..ఓ కంపెనీ ఏకంగా తమ ఉద్యోగస్తులకు హాలీడేనే ప్రకటించింది.
(చదవండి: ఇదెక్కడి విడ్డూరం.. తెలుగు ప్రేక్షకులపై ఎందుకీ భారం?)
సౌత్‌తో పాటు ఇండియా వ్యాప్తంగా పలు బ్రాంచ్‌లు కలిగి ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీ రజనీకాంత్ కొత్త సినిమా ‘కూలీ’(Coolie Movie) రిలీజ్ రోజు(ఆగస్ట్ 14) తమ ఉద్యోగులకు వేతనంతో కూడా సెలవును ప్రకటించింది. అంతేకాదు రిలీజ్ రోజు తమ ఎంప్లాయిస్‌కి ఉచితంగా టికెట్‌ని కూడా అందిస్తున్నట్లు ప్రకటించింది.దీంతో పాటు రజనీకాంత్ 50 ఏళ్ల సినీ కెరీర్‌ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అనాథ ఆశ్రమాలలో అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టబోతున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆ కంపెనీపై తలైవా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
(చదవండి: రెమ్యునరేషన్‌తో ఆర్ నారాయణ మూర్తిని కొనలేం: త్రివిక్రమ్)
కూలీ విషయానికొస్తే.. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగార్జున విలన్గా నటించాడు. సత్యరాజ్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, సౌబిన్ షాహిర్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ పాటలు ఇప్పటికే బ్లాక్ బస్టర్స్ అయిపోయాయి. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌పై రజిని అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. మరి ఫలితం ఏమవుతుందనేది చూడాలి.
As usual Holiday being declared for offices as COOLIE releasing 😂🫨🦖🔥 pic.twitter.com/pj54B8uqA2
— Hello (@RockinggRAJINI) August 9, 2025