
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోయిన్లలో శ్రుతీహాసన్(Shruti Haasan) ఒకరు. సినిమా అప్డేట్స్తో పాటు తన పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. అంతేకాదు తరచు ఫోటోషూట్ చేసి వాటిని ఇన్స్టాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ని అలరిస్తుంది. ఇన్స్టాలో ఆమెకు 24 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారంటే..ఆమె నెట్టింట ఎంత యాక్టివ్గా ఉంటున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా ఈ బ్యూటీ సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందట. ఈ విషయాన్ని తన ఫాలోవర్స్కి తెలియజేస్తూ ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టింది.
కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండి నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలనుకుంటున్నట్లు తెలిపింది. అయితే ఇటీవల ఈ అమ్మడు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిన విషయం తెలిసిందే. తన అకౌంట్‌ను రికవరీ చేసుకున్నట్లు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలోనే ఆమె సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకోబోతున్నట్లు ప్రకటించడంతో అంతా షాక్ అవుతున్నారు. శ్రుతీహాసన్ సినిమాల విషయాలకొస్తే.. ప్రస్తుతం రజనీకాంత్ కూలీ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 14న విడుదల కానుంది.