
రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటించిన చిత్రం 'కూలీ' ఓటీటీలోకి వచ్చేసింది. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆగష్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీలో నాగార్జున, ఆమిర్ ఖాన్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించారు.
నేడు అర్ధరాత్రి ( సెప్టెంబర్ 11) నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూలీ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. విడుదలైన నెలరోజుల్లోపే ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడం విశేషం. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూలీ అందుబాటులోకి వచ్చేసింది. థియేటర్‌లో చూడని వారు ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేయడంతో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అయితే హిందీ రిలీజ్ గురించి మాత్రం ఎటువంటి అప్‌డేట్ ఇవ్వలేదు. అంటే కూలీ హిందీ వర్షన్ మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి రానుందని తెలుస్తోంది.

కథేంటి..?
వైజాగ్ పోర్ట్‌లో కింగ్‌పిన్ లాజిస్టిక్స్ పేరుతో సైమన్ (నాగార్జున) పెద్ద డాన్‌గా చెలామణీ అవుతుంటాడు. ఖరీదైన వాచీలు, ఎలక్ట్రానిక్స్ లాంటివి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే ఎక్స్‌పోర్ట్స్ ముసుగులో చేయకూడని పనేదో చేస్తుంటారు. సైమన్ అండర్‌లో దయాల్ (సౌబిన్ షాహిర్) ఇదంతా చూసుకుంటూ ఉంటాడు. వీళ్ల దగ్గర పనిచేసే రాజశేఖర్ (సత్యరాజ్) ఓ రోజు చనిపోతాడు. ఇతడికి దేవా (రజినీకాంత్) అనే ఫ్రెండ్ ఉంటాడు. కొన్ని కారణాల వల్ల దేవా-రాజశేఖర్.. 30 ఏళ్ల పాటు దూరంగా ఉంటారు. తన ప్రాణ స్నేహితుడు ఇక లేడనే విషయం తెలుసుకుని దేవా.. వైజాగ్ వస్తాడు. తర్వాత ఏమైంది? సైమన్-దేవాకి కనెక్షన్ ఏంటి? ఇంతకీ కలీషా (ఉపేంద్ర), ప్రీతి(శ్రుతి హాసన్), దాహా(ఆమిర్ ఖాన్) ఎవరు? అనేది మిగతా స్టోరీ.