
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తోన్న చిత్రం 'కూలీ'. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న కాంబోపై తలైవా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ రిలీజ్ కాగా.. అంచనాలు మరింత పెంచేసింది. ఈ మూవీలో కింగ్ నాగార్జున, బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రంలో అమిర్ ఖాన్ దహా అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ రోల్ కోసం అమిర్ ఖాన్ మేకోవర్ వీడియోను నిర్మాణ సంస్థ పోస్ట్ చేసింది. ఈ పాత్ర కోసం ఒంటినిండా టాటూతో కనిపించారు అమిర్ ఖాన్. శనివారం జరిగిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు సైతం చేతి నిండా పచ్చబొట్టుతో కనిపించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. భుజంపై జాకెట్ పట్టుకుని దర్జాగా నడుచుకుంటూ వచ్చి అభిమానులను పలకరించాడు.
Can’t keep calm when Mr. Perfectionist Aamir Khan walks in with full swag!😎 #CoolieUnleashed ✨@rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan #Coolie #CoolieFromAug14 pic.twitter.com/DFv306PuI9
— Sun Pictures (@sunpictures) August 2, 2025