
నారా రోహిత్ హీరోగా నటించిన 'సుందరకాండ' చిత్రం ఆగస్టు 27న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తన మూవీ ప్రమోషన్స్ కోసం ఆయన పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కూలీ, వార్2 సినిమాలు చూశారా..? ఎలా ఉన్నాయంటూ ఆయన్ను ప్రశ్నించారు. ఈ సందర్భంలో రోహిత్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఎన్టీఆర్ సినిమా విడుదలైతే తప్పకుండా తన కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ అభిమానులు చూస్తారు. అయితే, కొంత కాలంగా తారక్‌ను నందమూరి, నారా ఫ్యామిలీలు దూరంగానే ఉంచుతూ వస్తున్నాయి. వార్ 2 మూవీ విడుదల సమయంలో తారక్‌పై టీడీపీ ఎమ్మెల్యేనే భూతులతో విరుచుకుపడ్డాడు.
అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో వార్2 సినిమా చూశారా అని 'నారా రోహిత్'ని ప్రశ్నించారు. అందుకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు. 'వార్ 2 సినిమా చూడలేదు. మా గ్యాంగ్ అంతా కూలీ సినిమా చూద్దాం అన్నారు. అప్పుడు నేనూ కూడా 'కూలీ' కోసమే వెళ్లాను. సినిమా అక్కడక్కడ నచ్చింది. ఓవరాల్‌గా పర్వాలేదు. వార్2 చూడలేదు. కానీ, సమయం దొరికితే తప్పకుండా చూస్తాను.' అని అన్నారు. అయితే, ఇక్కడ నారా రోహిత్‌ను నెటిజన్లు తప్పుబడుతున్నారు. మొదట కుటుంబ సభ్యుల సినిమాకు ప్రాధాన్యత ఇవ్వాలి కదా అంటూ ప్రశ్నిస్తున్నారు.
తారక్‌తో తనకు మంచి స్నేహం ఉందని నారా రోహిత్ (Nara Rohith) అన్నారు. ఎక్కడైనా తాము ఎదురైతే మంచిగానే మాట్లాడాతుమాన్నారు. కానీ, పెద్దగా ఫోన్స్‌లలో మాట్లాడుకోవడం వంటివి మాత్రం లేవన్నారు.