
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan), జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా వార్2.. ఆగష్టు 14న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేదు. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. ఈ ఫ్రాంఛైజీలోకి ఎన్టీఆర్ రావడంతో వార్2 కోసం తెలుగు వారు కూడా మరింత ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, టాలీవుడ్‌లో దారుణమైన నెగటివ్ రివ్యూలు కనిపించడంతో పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. తాజాగా ఈ సినిమా ఫలితం గురించి హృతిక్ రోషన్ ఒక పోస్ట్ చేశారు.
వార్2 గురించి హృతిక్ ఇలా చెప్పారు. 'వార్2లో కబీర్ పాత్ర పోషించడం చాలా సరదాగా అనిపించింది. ప్రాజెక్ట్ మొత్తం చాలా రిలాక్స్‌డ్‌గా పూర్తి చేశాను. నాకు ఆ పాత్ర గురించి పూర్తిగా తెలుసు కాబట్టి చాలా సులువు అయింది. ఒక నటుడిగా సినిమా కోసం నేను చేయాల్సింది చేశాను. సెట్స్‌లో నా పని పూర్తి అయిన తర్వాత ఇంటికి రావడం.. మరుసటి రోజు షెడ్యూల్ ఏంటో చూసుకోవడం జరిగేది. నా దర్శకుడు అయాన్ నన్ను చాలా బాగా చూసుకున్నాడు. సెట్‌లో అతను ఎప్పుడూ కూడా చాలా ఎనర్జీగా కనిపిస్తూ ఉండటం చాలా సంతోషాన్ని ఇచ్చింది. సినిమా చేస్తున్నంత కాలం ప్రతిదీ చాలా పరిపూర్ణంగా అనిపించింది. నా పని నేను పూర్తి చేస్తే సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకం.. కానీ, వెనుక నుంచి మమ్మల్ని ఏదో పదేపదే ఆపుతున్న ఒక శబ్ధం వినిపించేది. ప్రతి సినిమా ఒక చిత్రహింసలా, ఒక గాయంలా ఉండాల్సిన పనిలేదు. జస్ట్ రిలాక్స్" అని హృతిక్ పోస్ట్ చేశాడు.
వార్ 2 సినిమాకి ఎక్కువగా నెగటివ్ రివ్యూలే వచ్చాయి. రూ. 400 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన వార్ 2 రూ. 236.55 కోట్లు వసూలు చేసిందని నివేదికలు చెబుతున్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2019లో విడుదలైన వార్ కంటే తక్కువ మొత్తంలో వసూలు చేసింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ. 318.01 కోట్లు వసూలు చేసింది.