
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న 'వార్2' సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. వారందరి కోసం తాజాగా హృతిక్ ఒక శుభవార్త చెప్పారు. టీజర్ ఎప్పుడు విడుదలౌతుందో ప్రకటించారు. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఆదిత్యా చోప్రా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీ నటిస్తున్నారు. తన పాత్రకూ కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయని తెలిసింది.
హృతిక్ రోషన్(Hrithik Roshan) తాజాగా తారక్‌ను ట్యాగ్ చేస్తూ సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. 'హాయ్.. తారక్ ఈ సంవత్సరం మే 20న ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా..? సిద్ధంగా ఉండు నువ్వు ఊహించలేని గిఫ్ట్ ఉంటుంది' అని ఆయన పంచుకున్నారు. ఈ సారాంశాన్ని చూస్తే వార్2 టీజర్ ఆరోజున విడుదల కావచ్చని తెలుస్తోంది. మే 20 ఎన్టీఆర్ పుట్టినరోజు ఉంది. కాబట్టి ఆరోజు ఈ సినిమా నుంచి తప్పకుండా టీజర్ విడుదల కా 2019లో హిట్‌గా నిలిచిన హిందీ చిత్రం ‘వార్’కు సీక్వెల్‌గా ‘వార్ 2’ తెరకెక్కుతుంది. ఈ సినిమాపై టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.
దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఆగష్టు 14న విడుదల కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్‌గా నటించనున్నారని బాలీవుడ్ మీడియా పేర్కొంది. గతంలో షారుక్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, హృతిక్ రోషన్‌లు రా ఏజెంట్ పాత్రలలో నటించి అక్కడ మంచి గుర్తింపుతో పాటు విజయాన్ని అందుకున్నారు. అయితే, వార్2లో వీటన్నింటికంటే భిన్నంగా ఎన్టీఆర్ పాత్ర ఉందని తెలుస్తోంది. ఆపై ఈ మూవీలో హృతిక్ - ఎన్టీఆర్‌లపై అదిరిపోయే సాంగ్‌ను ప్లాన్ చేశారట . దాదాపు 500మంది డ్యాన్సర్లుతో వారు స్టెప్పులేశారట.
Hey @tarak9999, think you know what to expect on the 20th of May this year? Trust me you have NO idea what’s in store. Ready?#War2
— Hrithik Roshan (@iHrithik) May 16, 2025