
హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక పాత్రల్లో వచ్చిన యాక్షన్ చిత్రం వార్-2. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ నెల 14న థియేటర్లలో విడుదలైంది. జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగేట్రం చేసిన ఈ సినిమాకు తొలిరోజే మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. రజినీకాంత్ కూలీ మూవీతో బాక్సాఫీస్ బరిలోకి దిగిన వార్-2 మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్స్ సాధించింది.
దేశవ్యాప్తంగా దాదాపు రూ.60 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. వసూళ్లపరంగా హిందీలో అత్యధికంగా రాగా.. తెలుగు రాష్ట్రాల్లో రెండో అత్యధిక వసూళ్లతో రాణించింది. అయితే యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్లో వచ్చిన ఏక్ థా టైగర్ సినిమా వసూళ్ల కంటే తక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది. ఇది స్పై యూనివర్స్‌లో అత్యల్ప ఓపెనింగ్ నమోదు చేసింది .అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి రోజున హిందీలో దాదాపు రూ. 30 కోట్లకు పైగా నెట్ వసూళ్లను రాబట్టింది. తెలుగులోనూ అదే స్థాయిలో దాదాపు రూ.30 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ, అనిల్ కపూర్, అశుతోష్ రాణా ముఖ్య పాత్రల్లో నటించారు.