యుద్ధానికి సిద్ధం | Jr Ntr about war 2 movie updates | Sakshi
Sakshi News home page

యుద్ధానికి సిద్ధం

Oct 12 2024 3:03 AM | Updated on Oct 12 2024 3:03 AM

Jr Ntr about war 2 movie updates

‘వార్‌’కి సిద్ధం అవుతున్నారు ఎన్టీఆర్‌. హృతిక్‌ రోషన్‌తో ఆయన యుద్ధం చేయనున్నారు. ఇక ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌ జంటగా నటించిన ‘దేవర:పార్ట్‌ 1’ గత నెల 27న విడుదలైన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. తొలి భాగం సూపర్‌ హిట్‌ కావడంతో ‘దేవర’ రెండో భాగంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఒక నెల విరామం తీసుకుని రెండో భాగం పనులు మొదలు పెట్టమని కొరటాల శివకి ఎన్టీఆర్‌ సూచించారట.

ఇక ఎన్టీఆర్‌ మాత్రం ‘వార్‌ 2’ చిత్రం షూట్‌లోపాల్గొనడానికి రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్‌ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘వార్‌ 2’. హృతిక్‌ రోషన్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. జాన్‌ అబ్రహాం, కియారా అద్వానీ తదితరుల కాంబినేషన్‌లో ‘వార్‌ 2’ని యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తోంది. స్పై థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో నెగటివ్‌ షేడ్స్‌ ఉన్నపాత్రలో ఎన్టీఆర్‌ కనిపించనున్నారని టాక్‌.

ఇప్పటికే అటు ముంబై ఇటు హైదరాబాద్‌ షెడ్యూల్స్‌లో హృతిక్‌–ఎన్టీఆర్‌లపై కాంబినేషన్‌ సీన్స్‌ చిత్రీకరించారు మేకర్స్‌. అయితే ‘దేవర:పార్ట్‌ 1’ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న ఎన్టీఆర్‌ ‘వార్‌ 2’ షూట్‌కి కాస్త గ్యాప్‌ ఇచ్చారు. దసరా పండగ తర్వాత ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను ప్లాన్‌ చేసింది యూనిట్‌. ఈ షెడ్యూల్‌లో హృతిక్‌ రోషన్, ఎన్టీఆర్‌ల మధ్య క్లైమాక్స్‌ ఫైట్‌ని చిత్రీకరించనున్నారట. 2025 ఆగస్టు 14న ఈ సినిమా విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement