
ఆంధ్రప్రదేశ్ ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఇది ఒకటి.

శ్రీ పెద్దింట్లమ్మ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కృష్ణా జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోట అనే గ్రామంలో ఉంది.

నీటి మధ్యలో ద్వీపకల్పం పద్మాసన భంగిమలో ఆశీనులైన పెద్దింట్లమ్మ తల్లి.

అమ్మకు ఏటా జాతర (తీర్థం) నిర్వహిస్తారు. ఆ సమయంలో కొల్లేటికోట పెద్ద జనారణ్యంగా మారుతుంది. జాతరలో ప్రధాన ఘట్టమైన జలదుర్గాగోకర్ణేశ్వరస్వామి కల్యాణం రోజున ప్రభల ఊరేగింపు, బోనాల సమర్పణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

అమ్మవారిని దర్శించేందుకు ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు వస్తుంటారు.

పెద్దింట్లమ్మ ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో 44 కొల్లేరు దిబ్బలపై నివసించే వారందరికీ కులదైవంగా ఆరాధింపబడటం విశేషం.

తెలంగాణలో ఉజ్జయిని మహంకాళి, మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, మారెమ్మలకు జూలై నెలలో బోనాలు సమర్పిస్తారు.

రవాణా సౌకర్యాలు: ఆకివీడు నుండి లాంచీల ద్వారా, ఏలూరు నుండి కైకలూరు మీదుగా బస్సు ద్వారా ఇక్కడికి చేరవచ్చు.












