విశాఖపట్నం: చల్లగా తాకి వణికించే చిరుగాలులు, మిట్టమధ్యాహ్నమైనా సూరీడిని సైతం కప్పేసే దట్టమైన పొగమంచు.. సున్నా డిగ్రీల వాతావరణం.. ఇవన్నీ ఆస్వాదించాలంటే కశ్మీర్, సిమ్లా, ఖండాలా వెళ్లాల్సిన పనిలేదు. వాటిని మరిపించే హిల్‌స్టేషన్ మన రాష్ట్రంలోని లంబసింగి! విశాఖకు 135 కిలోమీటర్ల దూరంలో చింతపల్లి మండలంలోని ఓ చిన్న గిరిజన గ్రామం ఇది.
చలికాలంలో ఈ ప్రదేశం ప్రకృతి రమణీయంగా కాశ్మీర్ అందాలను మైమరిపిస్తుంది.
సెలవుల్లో, వీకెండ్స్ లో ఈ ప్రాంతాలలో పర్యటిస్తే జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది.
ఇక్కడి అందమైన పర్వతాలు, పచ్చని అడవులు.. ముగ్ధమనోహర లోయలు.. గలగలలాడే సెలయేటి పరవళ్లు పర్యటకుల్ని కొత్త లోకానికి తీసుకెళ్తాయి.
ఇక లంబసింగి ప్రాంతం చేరుకోవాలంటే విశాఖపట్నానికి చేరుకుని అక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లంబసింగి ప్రాంతానికి కారు లేదా బైక్ మీద చేరుకోవచ్చు.
ఇక హైదరాబాద్ నుంచి అయితే విశాఖపట్నం రైలు, బస్సు లేదా విమానం ద్వారా చేరుకుని అక్కడి నుంచి లంబసింగికి చేరుకోవచ్చు.


