
టాలీవుడ్ లో ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు శివాని నాగరం. ఈ హైదరాబాద్ అమ్మాయి వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

2024లో విడుదలైన “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

సుహాస్ కు జోడిగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ అమ్మడకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.

ఆమె ప్రస్తుతం “లిటిల్ హార్ట్స్” అనే మూవీతోపాటు సుహాస్ తో ‘హే భగవాన్’ అనే సినిమాలో కూడా నటిస్తోంది.











