
మలయాళంలో గాయనిగా మంచి పేరు తెచ్చుకున్న ఆర్య దయాళ్ ప్రేమ వివాహం చేసుకుంది. తాజాగా ఇదే విషయాన్ని సోషల్‌మీడియాలో ప్రకటించింది. చాలా కాలంగా అభిషేక్‌తో ప్రేమలో ఉన్నానంటూ చాలా సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన పెళ్లి సర్టిఫికెట్‌ను చూపుతూ తన భర్తతో పాటు ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కొత్త దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
‘బేబీ’ సినిమాతో తెలుగు పరిశ్రమకి ఆర్య దయాళ్ పరిచయమైంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాలోని ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా’ పాటను ఆమె పాడారు. తెలుగులో ఆమెకు ఇదే తొలి కావడం విశేషం. ఈ పాటకు టాలీవుడ్‌లో అభిమానులు భారీగానే ఉన్నారు. స్టార్ సింగర్‌గా మలయాళంలో భారీ క్రేజ్ ఉన్న ఆర్య దయాళ్ ఇలా సింపుల్‌గా పెళ్లి చేసుకోవడంతో అందరూ ఈ దంపతులను అభినందిస్తున్నారు. అభిషేక్ కూడా సంగీత ప్రపంచంలోనే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.