దిల్‌ రాజు చేతికి 'వార్‌ 2'.. కూలీ ఎఫెక్ట్‌తో పక్కా ప్లాన్‌ | Dil Raju Distributing War 2 Movie | Sakshi
Sakshi News home page

దిల్‌ రాజు చేతికి 'వార్‌ 2'.. కూలీ ఎఫెక్ట్‌తో పక్కా ప్లాన్‌

Jun 10 2025 9:47 AM | Updated on Jun 10 2025 10:03 AM

Dil Raju Distributing War 2 Movie

బాలీవుడ్‌ స్పై యాక్షన్  డ్రామా చిత్రం ‘వార్‌ 2’ ఆగష్టు 14న విడుదల కానుంది. హృతిక్‌ రోషన్, ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ మూవీ హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్‌ కానుంది. మరో రెండు నెలల్లో ఈ చిత్రం విడుదల సందడి మొదలు కానుంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో  బిజినెస్‌కు సంబంధించిన వ్యవహారాలు అప్పుడే ఊపందుకున్నాయి. ఇక్కడ యష్ రాజ్ ఫిలింస్ సొంతంగానే వార్‌2 ను విడుదల చేయాలని అనుకుంటున్నారు. కానీ, చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారట.

వార్‌2 సినిమాకు సంబంధించి తెలుగు రాష్ట్రాల  హక్కుల కోసం దాదాపు 120 కోట్లకు పైగానే యష్‌ రాజ్‌ ఫిలింస్‌  కోట్ చేసింది. అయితే, చాలా పక్కా ప్లాన్‌తో ఆ సంస్థ అడుగులేస్తుంది.  రజనీకాంత్‌, నాగార్జున,  లోకేష్ కనకరాజ్‌ల సినిమా కూలీ కూడా అదే సమయంలో వస్తుండటంతో సౌత్‌ ఇండియాలో వార్‌2కు పోటీ తప్పదు.  అందుకే వార్‌2 చిత్ర యూనిట్‌ ముందుగా జాగ్రత్త పడుతుందని టాక్‌. 

డిస్ట్రిబ్యూషన్‌ విషయంలో వార్ 2 సరికొత్త ప్లాన్‌తో వెళ్తున్నట్లు తెలుస్తోంది. నేరుగా ముంబై నుంచే థియేటర్ల యజమానులతో వారు డీల్‌ సెట్‌ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు అగ్రిమెంట్‌లు కూడా స్టార్ట్ చేసేశారు. కానీ,  ఉత్తరాంధ్ర ఏరియా మాత్రం నిర్మాత దిల్ రాజు సంస్థకు ఇచ్చారని తెలుస్తోంది. వార్‌2 చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్లకు  ఇవ్వాలా లేదా తామే పంపిణీ చేద్దామా అనే అంశాన్ని ప్రస్తుతానికి ఆ టీమ్‌ పక్కన పెట్టేసింది.

Advertisement
 
Advertisement
Advertisement