
హృతిక్ రోషన్, కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా హీరో ఎన్టీఆర్ హిందీ చిత్ర పరిశ్రమకి పరిచయమవుతున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్‌పై ఆదిత్యా చోప్రా పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో ‘వార్ 2’ ఆరవ చిత్రంగా రాబోతోంది.
ఈ సినిమా ట్రైలర్‌ని ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించి, ఎన్టీఆర్–హృతిక్ రోషన్‌ల పోస్టర్ రిలీజ్ చేశారు. ‘‘ఇండియన్ సినీ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు గొప్ప స్టార్స్ అయిన ఎన్టీఆర్–హృతిక్ రోషన్ తమ సినీ ప్రయాణంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు.
ఇదొక లైఫ్ టైమ్ మూమెంట్. ఈ అరుదైన క్షణాలను మరింత గొప్పగా సెలబ్రేట్ చేసుకోవటానికి ఈ నెల 25న ‘వార్ 2’ ట్రైలర్ విడుదల చేస్తున్నాం. ఇద్దరు గొప్ప స్టార్స్ మధ్య జరిగే అద్భుత పోరాటమే ఈ సినిమా. జూలై 25ని మీ క్యాలెండర్‌లో ప్రత్యేకంగా మార్క్ చేసుకోండి’’ అని యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ పేర్కొంది.