
రజినీకాంత్ హీరోగా నటించిన 'కూలీ' సినిమాలో అక్కినేని నాగార్జున విలన్‌గా నటించారు. అయితే, నాగ్‌కు తమిళ్‌లో కూడా అభిమానులు ఉన్నారు. కూలీలో ఆయన పాత్రకు అక్కడి అభిమానులు ఫిదా అవుతున్నారు. అయితే, మూవీ ఇంటర్వెల్‌లో నాగార్జున నటించిన సినిమా నుంచి ఒక హిట్ సాంగ్‌ను ప్రదర్శించాలని కోరారు. దీంతో థియేటర్ యజమానులు కూడా ఆ పాటను ప్రదర్శించి నాగ్ అభిమానులను ఆనందపరిచారు.
కూలీ సినిమాకు మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా దుమ్మురేపుతుంది. ఇప్పటి వరకు ఏకంగా సుమారు రూ. 350 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే, కన్యాకుమారి, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో కూలీ ప్రదర్శించబడుతున్న థియేటర్స్‌లలో నాగార్జున నటించిన రక్షకుడు (రత్చగాన్) సినిమా పాటను బిగ్ స్క్రీన్‌పై టెలికాస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 1997లో విడుదలైన రక్షకుడు నుంచి 'సోనియా సోనియా' సాంగ్‌ను ఫ్యాన్స్ కోరారు. దీంతో ఇంటర్వెల్ సమయంలో ఆ పాటను యాజమాన్యం ప్రదర్శించింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌కు నాగార్జున, సుష్మితా షేన్ వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ కూడా దుమ్మురేపారు.
లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రం 'కూలీ'... ప్రపంచవ్యాప్తంగా తాజాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. భారీ యాక్షన్ థ్రిల్లర్ కూలీ తమిళనాడులో సత్తా చాటుతుంది. మొదటిరోజు ఏకంగా రూ. 151 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మొదటిరోజు కలెక్షన్స్ పరంగా ఇదే టాప్.. ఇందులో రజనీకాంత్‌తో పాటు నాగార్జున, శ్రుతిహాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, రచితా రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
As Audience wish, we Screened #Nagarjuna's sir Iconic #SoniyaSoniya song on the Interval of #Coolir and the Audience was totally enjoyed☺️, it added a new vibe ❤️.
Book now and enjoy this kinda exclusive btw the Show.#coolieinsribalajicinemas@iamnagarjuna @chay_akkineni pic.twitter.com/7x1EARrCG0— Sri Balaji Cinemas (@BalajiCinemas) August 17, 2025