
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం కూలీ. ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ (lokesh kanagaraj) దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను దాదాపు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.
అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ నటిస్తున్నారని గతంలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు అమిర్ ఖాన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో దహా అనే పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. తాజాగా విడుదలైన అమిర్ ఖాన్ లుక్ అదిరిపోయిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో కూలీ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి.
Introducing #AamirKhan as Dahaa, from the world of #Coolie 😎⚡#Coolie is all set to dominate IMAX screens worldwide from August 14th 🔥@rajinikanth @Dir_Lokesh @anirudhofficial @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @anbariv @girishganges… pic.twitter.com/Z8pI5YJzRe
— Sun Pictures (@sunpictures) July 3, 2025