జైపూర్‌కు కూలీ | Rajinikanth Coolie Movie Next Schedule Shoot Jaipur | Sakshi
Sakshi News home page

జైపూర్‌కు కూలీ

Published Sun, Dec 8 2024 3:39 AM | Last Updated on Sun, Dec 8 2024 3:39 AM

Rajinikanth Coolie Movie Next Schedule Shoot Jaipur

జైపూర్‌ వెళ్లనున్నారు కూలీ. రజనీకాంత్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కూలీ’. ఈ చిత్రంలో నాగార్జున, శ్రుతీహాసన్, సత్యరాజ్, సౌబిన్‌ షాహిర్‌ ఇతర లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్, హీరోయిన్‌ రెబ్బా మౌనికా జాన్‌ ఇతర లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. 

కాగా ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ జైపూర్‌లో జరగనుందని, ఈ షెడ్యూల్‌లో రజనీకాంత్, ఆమిర్‌ ఖాన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ షెడ్యూల్‌తో సినిమా దాదాపు పూర్తవుతుందట. కళానిధి మారన్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. ‘కూలీ’ సినిమాను కార్మిక దినోత్సవం సందర్భంగా మే 1న రిలీజ్‌  చేసే ఆలోచనలో యూనిట్‌ ఉందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement