
దర్శనా.. హృదయం సినిమాలోని ఈ పాట ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. పాటే కాదు సినిమా కూడా సూపర్ హిట్టు. 2022లో వచ్చిన హృదయం మూవీలో ప్రణవ్ మోహన్‌లాల్ హీరోగా కల్యాణి ప్రియదర్శన్, దర్శనా రాజేంద్రన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కానీ చాలామంది తనను తిట్టుకున్నారంటోంది హీరోయిన్ దర్శనా రాజేంద్రన్ (Darshana Rajendran).
హీరోయిన్‌గా సూటవ్వలేదంటూ..
దర్శన కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ పరదా. ఈ సినిమా ప్రమోషన్స్‌లో దర్శన మాట్లాడుతూ.. హృదయం చూసిన చాలామంది నన్నెలా హీరోయిన్‌గా తీసుకున్నారని ప్రశ్నించారు. హీరో ప్రణవ్ పక్కన హీరోయిన్‌గా సెట్ అవలేదని విమర్శించారు. సినిమా చాలా పెద్ద సక్సెస్ అయినప్పటికీ నాపై వచ్చిన నెగెటివిటీ చూసి మొదట్లో భరించలేకపోయాను. నిజానికి సినిమా ఫ్లాప్ అయితే జనాలు కచ్చితంగా తమ ప్రతాపం చూపిస్తారు.
లైట్ తీసుకున్నా..
అంతా నెగెటివ్‌గానే మాట్లాడతారు. కానీ హృదయం హిట్టయినా నన్ను మాత్రం అందంగా లేనని తిట్టుకున్నారు. ఇలా నా గురించి ఏం కామెంట్ చేసినా ప్రతీది చదివేదాన్ని. ఆ కామెంట్లు చూసి నేను నా ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. నవ్వి లైట్ తీసుకున్నాను. కొందరైతే మరీ అసహ్యంగా కామెంట్లు చేస్తుంటారు. యాక్టర్స్‌ను దారుణంగా ట్రోల్ చేస్తారు అని చెప్పుకొచ్చింది. కాగా అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన పరదా చిత్రం ఆగస్టు 22న విడుదల కానుంది.