
ప్రతి ఆడపిల్లకు ఓ వయసు రాగానే నెలసరి ప్రారంభమవుతుంది. స్కూల్‌లో చదువుకునే రోజుల్లోనే బాలిక కౌమార దశలోకి అడుగుపెడుతుంది. అయితే తన ఫ్రెండ్స్ కంటే తాను ఆలస్యంగా మెచ్యూర్ అయ్యానని, దానికే అమ్మ కోప్పడిందని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, ఎంపీ కంగనా రనౌత్ చెప్పుకొచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన ఫస్ట్ పీరియడ్ అనుభవాలను పంచుకున్నారు.
ఎటు చూసినా రక్తమే..
కంగనా రనౌత్ మాట్లాడుతూ.. నా ఫ్రెండ్స్ అందరికీ ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి మధ్యలోనే పీరియడ్స్ మొదలయ్యాయి. నా ఫ్రెండ్స్ మెచ్యూర్ అవుతుంటే నేనింకా బొమ్మలతో ఆడుకుంటూ ఉండేదాన్ని. అప్పటికే నెలసరి రావట్లేదని కంగారుపడుతూ ఉంటే నేనేమో ఇలా బొమ్మలతో ఆడుకుంటున్నానని అమ్మ కోప్పడింది. ఆ బొమ్మల వల్లే ఇంకా పీరియడ్స్ రావడం లేదేమోనని కోపంతో వాటన్నింటినీ బయట పడేసింది. ఒకరోజు నేను నిద్రలేచేసరికి బెడ్‌షీట్ అంతా రక్తం.. ఎటు చూసినా రక్తమే కనిపించడంతో భయపడిపోయాను. కానీ, అమ్మ మాత్రం నాకు నెలసరి మొదలైందని సంతోషపడింది అని పేర్కొన్నారు.
సినిమా
సినిమాల విషయానికి వస్తే.. 2006లో గ్యాంగ్‌స్టర్ చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఏక్ నిరంజన్ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించారు. చివరగా ఎమర్జెన్సీ మూవీలో నటించారు. ఈ సినిమాలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీగా నటించారు. అంతేకాకుండా ఎమర్జెన్సీకి స్వయంగా కంగనాయే దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది.