నందమూరి బాలకృష్ణ అభిమానులకు బ్యాడ్ న్యూస్. అఖండ 2:తాండవం ప్రీమియర్స్ షోలు క్యాన్సిల్ అయ్యాయి. మరికొన్ని గంటల్లో ఈ మూవీ ప్రిమియర్స్ పడాల్సింది. కానీ సాంకేతిక కారణంగా ప్రీమియర్స్ షోలని రద్దు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం అఖండ 2(Akhanda 2) . ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతు వచ్చిన ఈ చిత్రం రేపు(డిసెంబర్ 5)న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రీలీజ్‌కి ఒక్క రోజు ముందే అంటే డిసెంబర్ 4న ప్రీమియర్స్ వేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల నంచి అనుమతి కూడా తీసుకున్నారు. ఏపీలో బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. ఇక మరికొన్ని గంటల్లో థియేటర్స్ బాలయ్య బొమ్మ పడుతుందని ఆశించిన అభిమానులకు చివరి నిమిషంలో మేకర్స్ షాకిచ్చారు.
“ఈరోజు వేయాల్సిన అఖండ ప్రీమియర్స్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల క్యాన్సిల్ అయ్యాయి. మేము సినిమా షో వేయడానికి చాలా ప్రయత్నించాం, కానీ కొన్ని మా చేతుల్లో లేకుండా పోయాయి. సారీ ఫర్ ది ఇన్‌కన్వీనియన్స్” అంటూ నిర్మాత సంస్థ 14 రీల్స్ ప్లస్ ట్వీట్ చేసింది. అయితే ఓవర్సీస్‌లో మాత్రం యాథావిధిగా ప్రీమియర్స్ షోలు ఉంటాయని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది.
#Akhanda2 Premieres scheduled for today are canceled due to technical issues.
We've tried our best, but a few things are beyond our control. Sorry for the inconvenience.— 14 Reels Plus (@14ReelsPlus) December 4, 2025


