breaking news
Darshana Rajendran
-
ఓటీటీకి పరదా హీరోయిన్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక సినిమాల చూసే తీరు పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్‌కు ఫుల్ డిమాండ్ ఉంటోంది. ఆడియన్స్ అభిరుచికి తగినట్లుగానే ఓటీటీలు సైతం అలాంటి కంటెంట్‌తోనే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఇక మలయాళ చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలకు ఓటీటీల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.తాజాగా మరో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. పరదాలో నటించిన దర్శన రాజేంద్రన్ లీడ్ రోల్లో ఈ వెబ్ సిరీస్‌ను తెరెకెక్కించారు. క్రిషంద్ దర్శకత్వంలో వస్తోన్న ఈ 4.5 గ్యాంగ్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఆగస్టు 29 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు.ట్రైలర్ చూస్తే క్రైమ్, కామెడీ రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌ను తిరువనంతపురంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించారు. పరదా సినిమా హీరోయిన్ దర్శన రాజేంద్రన్ కీలక పాత్ర పోషించడంతో ఈ సిరీస్‌పై ఆసక్తి నెలకొంది. ఆమె లేడీ విలన్‌గా కనిపించనుంది. ఈ సిరీస్ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. -
హిట్టు మూవీ.. నేను హీరోయిన్ ఏంటని అసహ్యకర కామెంట్లు!
దర్శనా.. హృదయం సినిమాలోని ఈ పాట ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. పాటే కాదు సినిమా కూడా సూపర్ హిట్టు. 2022లో వచ్చిన హృదయం మూవీలో ప్రణవ్ మోహన్‌లాల్ హీరోగా కల్యాణి ప్రియదర్శన్, దర్శనా రాజేంద్రన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కానీ చాలామంది తనను తిట్టుకున్నారంటోంది హీరోయిన్ దర్శనా రాజేంద్రన్ (Darshana Rajendran).హీరోయిన్గా సూటవ్వలేదంటూ..దర్శన కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ పరదా. ఈ సినిమా ప్రమోషన్స్‌లో దర్శన మాట్లాడుతూ.. హృదయం చూసిన చాలామంది నన్నెలా హీరోయిన్గా తీసుకున్నారని ప్రశ్నించారు. హీరో ప్రణవ్ పక్కన హీరోయిన్గా సెట్ అవలేదని విమర్శించారు. సినిమా చాలా పెద్ద సక్సెస్ అయినప్పటికీ నాపై వచ్చిన నెగెటివిటీ చూసి మొదట్లో భరించలేకపోయాను. నిజానికి సినిమా ఫ్లాప్ అయితే జనాలు కచ్చితంగా తమ ప్రతాపం చూపిస్తారు.లైట్ తీసుకున్నా..అంతా నెగెటివ్‌గానే మాట్లాడతారు. కానీ హృదయం హిట్టయినా నన్ను మాత్రం అందంగా లేనని తిట్టుకున్నారు. ఇలా నా గురించి ఏం కామెంట్ చేసినా ప్రతీది చదివేదాన్ని. ఆ కామెంట్లు చూసి నేను నా ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. నవ్వి లైట్ తీసుకున్నాను. కొందరైతే మరీ అసహ్యంగా కామెంట్లు చేస్తుంటారు. యాక్టర్స్‌ను దారుణంగా ట్రోల్ చేస్తారు అని చెప్పుకొచ్చింది. కాగా అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన పరదా చిత్రం ఆగస్టు 22న విడుదల కానుంది.చదవండి: ఎటు చూసినా రక్తమే.. భయపడిపోయా: కంగనారనౌత్