
ఓటీటీలు వచ్చాక సినిమాల చూసే తీరు పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్‌కు ఫుల్ డిమాండ్ ఉంటోంది. ఆడియన్స్ అభిరుచికి తగినట్లుగానే ఓటీటీలు సైతం అలాంటి కంటెంట్తోనే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఇక మలయాళ చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలకు ఓటీటీల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.
తాజాగా మరో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. పరదాలో నటించిన దర్శన రాజేంద్రన్ లీడ్ రోల్లో ఈ వెబ్ సిరీస్ను తెరెకెక్కించారు. క్రిషంద్ దర్శకత్వంలో వస్తోన్న ఈ 4.5 గ్యాంగ్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఆగస్టు 29 నుంచి స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు.
ట్రైలర్ చూస్తే క్రైమ్, కామెడీ రొమాంటిక్ థ్రిల్లర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌ను తిరువనంతపురంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించారు. పరదా సినిమా హీరోయిన్ దర్శన రాజేంద్రన్ కీలక పాత్ర పోషించడంతో ఈ సిరీస్పై ఆసక్తి నెలకొంది. ఆమె లేడీ విలన్గా కనిపించనుంది. ఈ సిరీస్ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది.