
హీరోలు రజనీకాంత్, కమల్‌హాసన్ కలిసి ఇరవై సినిమాలకు పైగా నటించారు. కానీ ‘అల్లావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్’ (1979) సినిమా తర్వాత రజనీ–కమల్ స్క్రీన్ షేర్ చేసుకోలేదు. తాజాగా వీరిద్దరినీ కలిపి ఓ భారీ సినిమా చేసేందుకు దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ప్రయత్నాలు మొదలుపెట్టారట. అయితే లోకేశ్ నెక్ట్స్ సినిమాగా కార్తీతో ‘ఖైదీ 2’ తెరకెక్కాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో రజనీ–కమల్ సినిమాని ఎప్పుడు ఆరంభిస్తారనే చర్చ జరుగుతోంది. మరి... నాలుగు దశాబ్దాల తర్వాత రజనీ–కమల్ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటారా? అనేది వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే... లోకేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన రజనీకాంత్ ‘కూలీ’, కమల్‌హాసన్ ‘విక్రమ్’ సినిమాలు సూపర్ హిట్స్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.