
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తోన్న చిత్రం 'కూలీ'. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న కాంబోపై తలైవా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ తేదీని కూడా అనౌన్స్ చేశారు. ఆగస్టు 2న కూలీ ట్రైలర్ విడుదల చేయనున్నారు.
తాజాగా కూలీ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. రజినీకాంత్ పోస్టర్ను షేర్ చేస్తూ సెన్సార్ తమకు ఏ సర్టిఫికేట్ జారీ చేసిందని ట్వీట్ చేసింది. కాగా.. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలోకి సందడి చేయనుంది. ఈ మూవీలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
#Coolie censored 🅰️ #Coolie releasing worldwide August 14th 🔥@rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv @girishganges @philoedit @ArtSathees @iamSandy_Off @Dir_Chandhru… pic.twitter.com/p2z6GEOb6K
— Sun Pictures (@sunpictures) August 1, 2025