
సెలబ్రిటీలకు అప్పుడప్పుడు వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. వెంటనే అవి కాస్త వైరల్ అవుతుంటాయి. తాజాగా హీరోయిన్ శ్రుతి హాసన్‌కి కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇంతకీ ఏమైంది? శ్రుతి హాసన్ ఎందుకు బతిమాలాడుకోవాల్సి వచ్చింది.
తమిళ బ్యూటీ అయిన శ్రుతి హాసన్.. రీసెంట్ టైంలో ఆడపాదడపా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు 'కూలీ'తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈమె పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే రిలీజ్ నాడే మూవీ చూద్దామని చెన్నైలో ఓ థియేటర్‌కి వెళ్లగా అక్కడి సెక్యూరిటీ గార్డ్ ఈమె ఉన్న కారుని ఆపేశాడు. దీంతో శ్రుతి హాసన్ అవాక్కయింది.
(ఇదీ చదవండి: రజినీకాంత్ 'కూలీ' సినిమా రివ్యూ)
దీంతో సదరు సెక్యూరిటీ గార్డ్‌తో.. 'నేను సినిమాలో ఉన్నాను. దయచేసి నన్ను లోపలికి అనుమతించండి అన్నా. నేనే హీరోయిన్ సార్' అని శ్రుతి హాసన్ బతిమలాడుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోని తమిళ ర్యాపర్ యుంగ్ రాజా తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోని చూసి నెటిజన్లు సరదాగా నవ్వుకుంటున్నారు.
'కూలీ' విషయానికొస్తే.. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. కానీ తొలిఆటకే మిశ్రమ స్పందన వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం తొలిరోజు ఏకంగా రూ.151 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. రెండో రోజు మాత్రం ఎంతొచ్చింది ఏంటనేది చెప్పలేదు. రూ.85 కోట్ల మేర వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అంటే ఇప్పటివరకు రూ.240 కోట్ల మేర వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: 'కూలీ'తో సక్సెస్.. కాస్ట్‌లీ కారు కొన్న నటుడు సౌబిన్)
#ShrutiHaasan 😂😂#Coolie
pic.twitter.com/LIB7LlfhBc— Prakash Mahadevan (@PrakashMahadev) August 15, 2025