హీరో విజయ్‌ పక్కన కచ్చితంగా నటిస్తా: హీరోయిన్‌ | Cynthia Lourde Says She Will Act Alongside Vijay | Sakshi
Sakshi News home page

సినిమాలకు విజయ్‌ గుడ్‌బై! ఆయన పక్కన నటిస్తానంటున్న హీరోయిన్‌

Dec 31 2025 6:58 AM | Updated on Dec 31 2025 6:58 AM

Cynthia Lourde Says She Will Act Alongside Vijay

హీరో విజయ్‌కు జంటగా కచ్చితంగా నటిస్తానంటోంది హీరోయిన్‌, నిర్మాత సింథియా లూర్డే. సింథియా ప్రొడక్షన్‌ హౌస్‌ పతాకంపై ఈమె నిర్మించి, కథానాయికగా నటించిన చిత్రం అణలి. దినేశ్‌ దీన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. డైరెక్టర్‌ పి.వాసు వారసుడు శక్తి వాసు ప్రతినాయకుడిగా నటించగా, బాలీవుడ్‌ నటుడు కబీన్‌ దుహాన్‌ సింగ్‌ మరో విలన్‌గా యాక్ట్‌ చేశాడు.

జనవరి 2న రిలీజ్‌
అభిషేక్‌, ఇళంగో కమరవెల్‌, నటి ఇనయ, జై సూర్య, మాథ్యూ వర్గీస్‌, అశోక్‌ పాండియన్‌, జాన్సన్‌ దివాకర్‌, వినోద్‌ సాగర్‌, బేబి శిమాలి, శివ ఇతర పాత్రల్లో నటించారు. రామలింగం చాయాగ్రహణం, దీపన్‌ చక్రవర్తి సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి 2న తెరపైకి రానుంది.

హీరో లేడు
సోమవారం సాయంత్రం చెన్నైలో ఈ సినిమా ట్రైలర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరోయిన్‌ సింథియా లూర్డే మాట్లాడుతూ.. వర్ణాశ్రమమ్‌, దినసరి చిత్రాల తర్వాత తాను నిర్మించిన మూడో సినిమాయే అణాలి అని పేర్కొంది. ఇందులో తనే హీరోయిన్‌ అని.. హీరో ఎవరూ లేరంది. హీరోలు కూడా నటించేందుకు సంకోచించే యాక్షన్‌ సన్నివేశాల్లో డూప్‌ లేకుండా తానే రిస్క్‌ తీసుకుని నటించానంది. 

ఇండియన్‌ సినిమా చరిత్రలోనే తొలిసారి..
ఇప్పుడు వస్తున్న చిత్రాల్లో కథే ఉండటం లేదని, అయితే దినేష్‌ దీన చెప్పిక కథలో బలం ఉండటంతో ఈ సినిమా ఒప్పుకున్నానంది. ఇండియన్‌ సినిమా చరిత్రలోనే తొలిసారిగా పదివేల కంటైనర్లు కలిగిన యార్డ్‌లో బ్రహ్మాండమైన సెట్‌ వేసి 30 రోజులపాటు అక్కడే షూటింగ్‌ నిర్వహించినట్లు చెప్పింది. 

విజయ్‌ సరసన నటిస్తా
విజయశాంతి తర్వాత పూర్తి యాక్షన్‌ హీరోయిన్‌గా నటించింది తానేనని పేర్కొంది. ఈ సినిమా రిలీజ్‌ హక్కులను రెడ్‌ జాయింట్‌ మూవీస్‌ సంస్థ పొందిందని తెలిపింది. జనవరి రెండున విడుదల చేస్తున్నామంది. హీరో విజయ్‌ సినిమాలకు స్వస్తి చెప్పారంటున్నారని.. కానీ ఆయన మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. విజయ్‌ సరసన త్వరలోనే కచ్చితంగా నటిస్తానని సింథియా (Cynthia Lourde) బల్లగుద్ది చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement