
రీసెంట్‌గా వచ్చిన 'కూలీ' సినిమా.. ప్రేక్షకుల్ని అలరిస్తోంది. మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. వీకెండ్ కావడంతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. అయితే ఈ చిత్రంలో అందరికంటే మలయాళ నటుడు సౌబిన్ షాహిర్.. యాక్టింగ్‌లో ఎక్కువ మార్కులు కొట్టేశాడు. తనదైన నటనతో కట్టిపడేశాడు. అలా అందరి ప్రశంసలు అందుకుంటున్న ఇతడు.. ఇప్పుడు కోట్లు విలువ చేసే ఖరీదైన కారు కొనేశాడు. ఇంతకీ దీని ధర ఎంతంటే?
(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)
ఓటీటీల్లో మలయాళ డబ్బింగ్ సినిమాలు చూసే తెలుగు ఆడియెన్స్‌కి సౌబిన్ చాలా ఏళ్లుగా పరిచయమే. అప్పుడెప్పుడో వచ్చిన 'ప్రేమమ్' నుంచి గతేడాది రిలీజైన 'మంజుమ్మల్ బాయ్స్' వరకు ఎన్నో చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు 'కూలీ' సినిమాతో దక్షిణాది ప్రేక్షకుల్ని పలకరించాడు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే సినిమాలో తన సక్సెస్‌ని ముందే అంచనా వేశాడో ఏమో గానీ ఈ మధ్యే బీఎండబ్ల్యూ ఎక్స్ఎమ్ కారుని కొనుగోలు చేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ కారు విలువ ప్రస్తుతం మార్కెట్‌లో రూ.3.30 కోట్లు వరకు ఉంది. తన కుటుంబంతో కలిసి సౌబిన్.. కారులో షికారుకి వెళ్లాడు. ఆ విజువల్స్ వీడియోలో చూడొచ్చు. 'కూలీ'తో అటు తమిళం, ఇటు తెలుగు దర్శకుల దృష్టిలో సౌబిన్ పడ్డాడు. మరి రాబోయే రోజుల్లో తెలుగు మూవీస్‌లోనూ ఇతడికి అవకాశాలు రావడం గ్యారంటీలానే కనిపిస్తోంది.
(ఇదీ చదవండి: రజినీకాంత్ 'కూలీ' సినిమా రివ్యూ)