'కూలీ'ని రిజెక్ట్ చేసిన పుష్ప విలన్.. ఎందుకంటే?
కూలీ సినిమా (Coolie Movie)కు బాగా హైప్ తెచ్చిన సాంగ్ మోనికా. పూజా హెగ్డే (Pooja Hegde) వేసిన స్టెప్పులకు యూట్యూబ్ షేక్ అవుతోంది. అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? అని అందరూ ఆశ్చర్యపోయేలా డ్యాన్స్ చేసింది. అయితే శివరాత్రిరోజే ఈ సాంగ్ షూటింగ్ జరిగిందట! అందులోనూ ఆరోజు పూజాకు ఉపవాసం. అయినా సరే ఖాళీ కడుపుతోనే సెట్లోకి అడుగుపెట్టి ఫుల్ జోష్‌తో డ్యాన్స్ చేసింది. తన కష్టానికి ప్రతిఫలంగా మోనికా సాంగ్ ఫుల్ ట్రెండ్ అవుతోంది.ఫస్ట్ ఆయన్నే అనుకున్నా..అయితే ఈ సాంగ్‌లో పూజాతోనే పోటీపడుతూ స్టెప్పులేశాడు మలయాళ నటుడు సౌబిన్ షాహిర్. తొలిసారి ఈ రేంజ్లో డ్యాన్స్ చేయడంతో సౌబిన్‌లో ఈ టాలెంట్ కూడా ఉందా? అని అందరూ నోరెళ్లబెట్టారు. నిజానికి సౌబిన్ స్థానంలో పుష్ప విలన్ ఫహద్ ఫాజిల్ ఉండాల్సిందట! ఈ విషయాన్ని దర్శకుడు లోకేశ్ కనగరాజ్ స్వయంగా వెల్లడించాడు. ద హాలీవుడ్ రిపోర్టర్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేశ్.. ఫహద్‌ను దృష్టిలో పెట్టుకునే ఆ పాత్ర రాసినట్లు తెలిపాడు. బిజీగా ఉండటంతో..తీరా ఫహద్‌ను సంప్రదించగా.. అప్పటికే వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ ఆఫర్ సున్నితంగా తిరస్కరించాడని పేర్కొన్నాడు. అందువల్లే సౌబిన్ను ఎంపిక చేశామని వెల్లడించాడు. లోకేశ్ డైరెక్ట్ చేసిన కూలీ మూవీలో రజనీకాంత్ కథానాయకుడిగా నటించాడు. నాగార్జున, శృతి హాసన్, ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు. ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది.చదవండి: ప్రముఖ దర్శకనటుడు కన్నుమూత