
సందట్లో సడేమియా... శునకానందం పొందాలయా...అన్నట్టుగా మారుతోంది కొందరు ప్రబుద్ధుల ప్రవర్తన. అభిమానం పేరిట అసభ్యత ముదురుతోంది. ముఖ్యంగా హీరోయిన్లపై అది అనుచితంగా మారుతోంది. రకరకాల కారణాలతో జన సమూహాల్లోకి వస్తున్న కధానాయికలను అసభ్యకరంగా తాకకూడని చోట తాకుతున్న సంఘటనలు కంపరం కలిగిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలలో బాధితులుగా మారిన పలువురు తారల జాబితాలో ఇప్పుడు మళయాళ నటి నవ్యనాయర్ కూడా జరిగింది.

వివరాల్లోకి వెళితే... పాతిరాత్రి అనే మళయాళ చిత్రంలో సౌబిన్ షాహిర్ (కూలీ ఫేమ్) నవ్యనాయర్‌లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా విడుదలను పురస్కరించుకుని వీరిద్దరూ పలు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదే క్రమంలో కోజికోడ్‌లోని హైలైట్ మాల్‌లో సినిమా ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. ఆ ఈవెంట్ తర్వాత సినిమా తారాగణం వేదిక నుంచి బయటకు వెళుతుండగా, ఊహించని సంఘటన జరిగింది, అక్కడ జనంలో ఉన్న ఒక వ్యక్తి నటి నవ్య నాయర్‌ను అకస్మాత్తుగా వెనుక నుంచి తడిమాడు. ఇది జరిగిన వెంటనే సౌబిన్ షాహిర్(Soubin Shahir) కూడా నవ్యనాయర్‌ను కాపాడే క్రమంలో తాను కూడా టచ్ చేశాడు. ఈ సంఘటన తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించడం ప్రారంభించారు. తొలుత తనను తాకిన వ్యక్తి వైపు నవ్యనాయర్ ఉరిమిచూడడం కూడా వీడియోలో కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లలో అనేక మంది నటికి మద్దతుగా కామెంట్స్ చేశారు. అయితే కొందరు మాత్రం ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు, అపరిచితులు తాకితే ఉరిమి చూసిన నటి సౌబిన్ తాకితే ఎందుకు ఊరుకుంది? అంటూ కొందరు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అయితే దీనిపై చాలా మంది అభిమానులు సౌబిన్‌ను సమర్థించడానికి ముందుకు వచ్చారు, వీడియోను పరిశీలనగా చూడాలని అందులో, అగంతకుడు తాకిన తర్వాత ఆమెకు రక్షణగా మాత్రమే సౌబిన్ వ్యవహరించాడని అంటూ కొందరు పరిణితి ప్రదర్శించారు. అంతేకాక తనను రెండవ సారి తాకింది సౌబిన్ అని ఆమెకు తెలుసు. అంటూ గుర్తు చేశారు. ‘‘ఒకరి శరీరంపై చేతులు పెట్టడానికి అనుమతి అవసరం... ఈ సంఘటనలో సౌబిన్ ఆమెను రక్షించడానికి ప్రయత్నిoచినట్టు స్పష్టంగా తెలుస్తోంది.’’ అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు.
రతీనా దర్శకత్వం వహించి బెంజీ ప్రొడక్షన్స్ నిర్మించిన పాతిరాత్రి సినిమాలో నవ్య సౌబిన్‌లు పోలీస్ ఆఫీసర్లు జాన్సీ, హరీష్ పాత్రలను పోషించారు. అర్ధరాత్రి జరిగే ఒక రహస్య సంఘటనను వారు వెలికితీసే థ్రిల్లర్ ఈ జంటను అనుసరిస్తుంది. ఈ చిత్రం అక్టోబర్ 17న విడుదల అవుతోంది.