సడన్‌గా ఓటీటీకి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌.. ఎక్కడ చూడాలంటే? | The Hunter Chapter 1 streaming on This ott from Today | Sakshi
Sakshi News home page

The Hunter Chapter 1: వెన్నులో వణుకు పుట్టించే మిస్టరీ థ్రిల్లర్.. సడన్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్

Dec 4 2025 6:26 PM | Updated on Dec 4 2025 6:51 PM

The Hunter Chapter 1 streaming on This ott from Today

వైభవ్ కీలక పాత్రలో నటించిన తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'రణం అరం తవరేల్'. ఈ సినిమాకు షరీఫ్  దర్శకత్వం వహించారు. గతేడాది ఫిబ్రవరిలో తమిళంలో విడుదలైన ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ అభిమానులను ఆకట్టుకుంది. తమిళంలో హిట్ కావడంతో తెలుగులో ది హంటర్‌: చాప్టర్‌-1 పేరుతో రిలీజ్ చేశారు. ఈ ఏడాది జూన్‌లో రిలీజైన ఈ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను మెప్పించింది.

తాజాగా ఈ చిత్రం ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు నుంచే ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే వారు ది హంటర్‌: చాప్టర్‌-1 చూసి ఎంజాయ్ చేయండి. ఈ మూవీలో నందితా శ్వేత, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించారు.  ఒక నగరంలో  జరిగిన వరుసగా హత్యల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఆ వరుస హత్యల వెనకున్న ప్రధానమైన కారణం ఏమిటి? అనేది అసలు కథ. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement