కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కన్నీటి పర్యంతమయ్యారు. ప్రముఖ నిర్మాత శరవణన్ పార్థీవదేహనికి నివాళులర్పించిన ఆయన.. తనలోని బాధను ఆపుకోలేకపోయారు. శరవణన్ మృతిని తలచుకుని చిన్నపిల్లాడిలా ఏడుస్తూ కనిపించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆయన మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
దిగ్గజ నిర్మాతగా శరవణన్..
నిర్మాత శరవణన్ మృతితో కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 300 వందల సినిమాలను నిర్మించారు. ఏవీఎం ప్రొడక్షన్స్ ద్వారా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. సంసారం ఒక చదరంగం, ఆ ఒక్కటి అడక్కు, మెరుపుకలలు, జెమిని, శివాజీ, లీడర్ లాంటి బ్లాక్‌బస్టర్స్ అందించారు. ఎంజీఆర్, శివాజీ, జెమిని గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్‌లతో వంటి లెజెండరీలు.. విక్రమ్, రానాలాంటి తారలు ఈ ప్రతిష్టాత్మక బ్యానర్‌లో నటించారు.
ఏవీఎం అంటే అర్థం.. ఏవీ మేయప్పన్. ఆయన శరవణన్ తండ్రి. మద్రాస్(నేటి చెన్నై) కేంద్రంగా ఈ బ్యానర్ తొలినాళ్లలో సరస్వతి సౌండ్ ప్రొడక్షన్స్‌గా..ఆ తర్వాత ప్రగతి పిక్చర్స్ లిమిటెడ్, ప్రగతి స్టూడియోస్.. మేయప్పన్( ఏవీ మేయ్యప్ప చెట్టియార్) తన భాగస్వాములతో కలిసి నడిపించారు. 1945లో AVM Productionsగా మారింది. అప్పటి నుంచి ఈ బ్యానర్‌లో ఎన్నో గొప్ప చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. తండ్రి ఏవీ మేయప్పన్ తర్వాత శరవణన్ ఆ ప్రొడక్షన్ హౌజ్‌ను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారు.
#WATCH | Tamil actor Suriya paid his respects to veteran producer AVM Saravanan at AVM Studio in Vadapalani. Suriya had worked in two of his hit films, Perazhagan and Ayan, under the AVM banner. Saravanan, who shaped generations of Tamil cinema, passed away at the age of 86.… pic.twitter.com/nAvEEnhEnQ
— The Federal (@TheFederal_News) December 4, 2025


