
ఈ వారం థియేటర్లలోకి వచ్చిన 'కూలీ', 'వార్ 2'కి మిశ్రమ స్పందన వచ్చింది. కానీ వీకెండ్, సెలవులు కలిసి రావడంతో జనాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు ఓటీటీల్లోనూ పలు కొత్త సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో చాలా వరకు డబ్బింగ్ చిత్రాలే ఉన్నాయి. అయితే ఎలాంటి ప్రకటన లేకుండా రెండు తెలుగు మూవీస్ కూడా స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. ఇంతకీ ఏంటవి? ఎందులో చూడొచ్చు?
గత నెల తొలివారం థియేటర్లలోకి వచ్చిన 'వర్జిన్ బాయ్స్' సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. కాకపోతే ఐఫోన్, డబ్బులు గిఫ్ట్స్ అనే ప్రమోషన్లతో వార్తల్లో నిలిచింది. అడల్ట్ కాన్సెప్ట్, యువతని టార్గెట్ చేసుకుని తీసిన ఈ చిత్రం.. ఇప్పుడు ఆహా, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లోకి వచ్చేసింది. తెలుగులోకి అందుబాటులో ఉంది.
(ఇదీ చదవండి: విజయ్‌తో రొమాంటిక్ స్టిల్.. ‘చాలా స్పెషల్’ అంటూ రష్మిక పోస్ట్)
మరోవైపు ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజైన 'సూర్యాపేట్ జంక్షన్' అనే తెలుగు సినిమా కూడా ఎలాంటి హడావుడి లేకుండానే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ విషయానికొస్తే.. అర్జున్ (ఈశ్వర్) కాలేజీలో చదువుతూ స్నేహితులతో జాలీ లైఫ్ గడుపుతుంటాడు. జ్యోతితో(నైనా సర్వర్) ప్రేమలో పడతాడు. మరోవైపు నరసింహ (అభిమన్యు సింగ్) ఎమ్మెల్యే అయ్యే ప్రయత్నాల్లో ఉంటాడు.
అయితే అర్జున్ స్నేహితుల్లో ఒకడైన శీను.. ఓ రోజు హత్యకు గురవుతాడు. శీనుని ఎవరు చంపారు? ఆ ఘటన వెనకున్న రాజకీయ కుట్ర ఏంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ. ఈ రెండు సినిమాలతో పాటు వీకెండ్ ఓటీటీల్లో రిలీజైన వాటిలో 'జానకి.వి vs స్టేట్ ఆఫ్ కేరళ', 'గ్యాంబ్లర్స్', 'సూపర్ మ్యాన్' తదితర చిత్రాలు కూడా ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి.
(ఇదీ చదవండి: రజినీకాంత్ 'కూలీ' సినిమా రివ్యూ)