breaking news
Virgin Boys Movie
-
వర్జిన్ బాయ్స్ హీరోయిన్ గొప్పమనసు.. నల్గొండ కుర్రాడికి సాయం!
బిగ్ బాస్ బ్యూటీ మిత్రా శర్మ ప్రస్తుతం వర్జిన్ బాయ్స్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా.. యూత్ ఆడియన్స్‌ను ఓ రేంజ్లో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషించారు. దయానంద్ గడ్డం దర్శకత్వంలో రాజా దారపునేని నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ జూలై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో మిత్రా శర్మ తన మంచి మనసును చాటుకుంది. నల్గొండ నుంచి వచ్చిన ఓ దివ్యాంగుడు ఈవీ ఇప్పించాలని కోరడంతో మిత్రా శర్మ అతని వివరాలు అడిగి తెలుసుకుంది. నీకు 15 రోజుల్లోనే ఈవీ వాహనం అందజేస్తామని అతనికి హామీ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ హీరోయిన్ మిత్రా శర్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు.అయితే ఈ సినిమా టికెట్ కొన్న 11 మందికి ఐఫోన్లు గిఫ్ట్ ఇస్తామని అనౌన్స్ చేశారు. మనీ రైన్ ఇన్ థియేటర్స్ అనే కాన్సెప్ట్‌తో కొన్ని థియేటర్లలో డబ్బు వర్షంలా కురిపిస్తామని.. ఆ డబ్బు ప్రేక్షకులు సొంతం చేసుకోవచ్చు అని బంపరాఫర్లు ప్రకటించారు. కాగా.. ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతాన్ని అందించారు. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా, జేడీ మాస్టర్ కొరియోగ్రఫర్‌గా పని చేశారు. Heroine @Mitraaw_sharma encounters a need boy at #VirginBoysTrailer Launch Event and extends her helping hand for an EV 👏#VIRGINBOYS IN THEATERS FROM JULY 11th ! pic.twitter.com/YYC6euA504— Rajesh Manne (@rajeshmanne1) July 7, 2025 -
హీరోయిన్గా మిత్రా శర్మ.. ఎంతందంగా ఉందో! (ఫోటోలు)
-
నాలో ఏదైనా లోపం ఉందా..? మిత్రా శర్మ ఎమోషనల్
-
ఈ సినిమాకు వెళ్తే థియేటర్లలో డబ్బుల వర్షం..
మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం వర్జిన్ బాయ్స్. దయానంద్ గడ్డం రచనా దర్శకత్వంలో రాజా దారపునేని నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ జూలై 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తుండగా వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా, జేడీ మాస్టర్ కొరియోగ్రఫర్‌గా పని చేశారు. శనివారం నాడు వర్జిన్ బాయ్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా.. ఈ సినిమా టికెట్ కొన్న 11 మందికి ఐఫోన్లు గిఫ్ట్ ఇస్తామన్నారు. మనీ రైన్ ఇన్ థియేటర్స్ అనే కాన్సెప్ట్‌తో కొన్ని థియేటర్లలో డబ్బు వర్షంలా కురిపిస్తామని, ఆ డబ్బు ప్రేక్షకులు సొంతం చేసుకోవచ్చు అని బంపరాఫర్లు ప్రకటించారు.ఈ సందర్భంగా నటుడు రోనిత్ మాట్లాడుతూ... "నేను, దర్శకుడు దయ కాలేజ్ ఫ్రెండ్స్. అప్పటినుండే ఇద్దరం సినిమాలు చేయాలని అనుకునే వాళ్ళం. చూస్తే పది సంవత్సరాల తర్వాత ఒక సినిమా స్టేజిపై ఉన్నాము. చిన్న సినిమాలకు ఊపిరి పోసే సినిమాగా వర్జిన్ బాయ్స్ నిలుస్తుందని అనుకుంటున్నాను" అన్నారు. నటుడు శ్రీహాన్ మాట్లాడుతూ.. తనను నమ్మి తనపై ఎంతో ఖర్చు పెట్టి ఎంకరేజ్ చేసిన నిర్మాతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.నటి మిత్ర శర్మ మాట్లాడుతూ... "ఈ సినిమాలో నా క్యారెక్టర్ కొంచెం కొత్తగా అనిపించింది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు దయానంద్ కు థాంక్స్. ఏదైనా సాధించాలి అనే సంకల్పంతో ముందుకు వచ్చాడు. తన కష్టం వల్లే మేము ఈరోజు ఈ స్టేజి మీద ఉన్నాము. రోనిత్ ఎంతో మంచి పర్ఫార్మెన్స్ చేశారు. శ్రీహాన్ చేసిన క్యారెక్టర్ లేకపోతే సినిమాలో కిక్ ఉండదు. అలాగే గీతానంద్ తో కలిసిన నటించడం బాగా ఎంజాయ్ చేశాను. చాలా సైలెంట్ గా ఉండే వ్యక్తి, బాగా సపోర్ట్ చేస్తారు. నేను మీ అందరిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను" అంటూ ముగించారు. -
నాలో ఏదైనా లోపం ఉందా? సరైన దారిలో లేనా?.. ఏడ్చేసిన బిగ్‌బాస్ బ్యూటీ
బిగ్‌బాస్ బ్యూటీ మిత్రా శర్మ (Mitraaw Sharma) హీరోయిన్గా, నిర్మాతగా అందరికీ సుపరిచితురాలే! తను బిగ్‌బాస్ నాన్‌స్టాప్ (ఓటీటీ) సీజన్లో పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఎప్పుడూ ఎవరో ఒకరికి సాయం చేస్తూ తన మంచి మనసు చాటుకుంటూ ఉంటుంది. మిత్రా శర్మ కథానాయికగా నటించిన తాజా చిత్రం వర్జిన్ బాయ్స్. ఈ మూవీ జూలై 11న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మిత్ర భావోద్వేగానికి లోనైంది. అమ్మ-నాన్నను కోల్పోయానేను పుట్టగానే అమ్మను కోల్పోయాను. చిన్నవయసులోనే నాన్నకూ దూరమాయ్యాను మా నాన్న టీచర్. ఆయన నాకు ఇచ్చింది విద్య మాత్రమే! ఆయన చనిపోయేముందు కూడా నువ్వు లేకుండా నేను బతకలేను నాన్న అని చాలా బాధపడ్డాను. ఆయన వెళ్లిపోయాక నాకంటూ ఎవరూ లేకుండా పోయారు. నా జీవితంలో ఎవరైనా ఉంటే వారికోసం ఏదైనా చేయాలనుకున్నాను. కానీ, అర్హత ఉన్నవారికే సాయం చేయాలి. ఎందుకంటే జీవితంలో ఎన్నో రిజెక్షన్స్ చూశాను.తలరాత మార్చలేరుగాతిరస్కరణకు గురైనప్పుడల్లా నాకేమనిపించేదంటే.. నాలో ఏమైనా లోపం ఉందా? సరైన దారిలో లేనా? లేదంటే టైం బాగోలేదా? ఇలా నన్ను నేనే ప్రశ్నించుకునేదాన్ని. తర్వాత మళ్లీ నాకు నేనే సర్ది చెప్పుకునేదాన్ని. మన దగ్గరున్న డబ్బు ఆఖరి రూపాయి వరకు ఎవరైనా తీసుకెళ్లవచ్చు. కానీ మన తలరాతను తీసుకెళ్లలేరు కదా అని రియలైజ్ అయ్యేదాన్ని. సాయం చేయాలి.. నాకంటూ మంచి మనుషులను సంపాదించుకోవాలి అనే లక్ష్యంతోనే ముందుకువెళ్తున్నాను అంటూ మిత్ర శర్మ కన్నీళ్లు పెట్టుకుంది.సినిమాగీతానంద్, మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం వర్జిన్ స్టోరీ. శ్రీహాన్, రోనీత్, జెన్నిఫర్, అన్షుల, సుజిత్ కుమార్, అభిలాష్ కీలక పాత్రల్లో నటించారు. దయానంద దర్శకత్వం వహించగా దారపునేని రాజా నిర్మించారు. జూలై 11న ఈ సినిమా రిలీజవుతోంది. సినిమా చూసినవారికి ఐఫోన్లు కూడా రిటర్న్ గిఫ్ట్‌గా ఇస్తామని ప్రకటించారు. సినిమా చూశాక.. టికెట్ ఫోటో తీసి 8019210011 నెంబర్‌కు వాట్సాప్ చేయాలని.. లక్కీ డ్రా ద్వారా 11 మందిని సెలక్ట్ చేసి ఐఫోన్ పంపిస్తామని క్రేజీ ఆఫర్ ఇచ్చారు.చదవండి: ప్రభాస్ రూ.50 లక్షల సాయం? ఒక్క రూపాయి అందలేదు: ఫిష్ వెంకట్ -
అలాంటి సన్నివేశంలో నటించా.. సిరి రియాక్షన్ ఇదే: శ్రీహాన్
గీతానంద్, మిత్రా శర్మ, శ్రీహాన్ (Shrihan), జెన్నీఫర్ ఇమాన్యుయేల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ‘వర్జిన్ బాయ్స్’. దయానంద్ గడ్డం దర్శకత్వంలో రాజా దారపునేని నిర్మించిన ఈ సినిమా జూలై 11న విడుదల కానుంది. స్మరణ్ సాయి సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘దం దిగ దం...’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. కాలేజ్ డేస్‌లోకి..ఈ పాటకి ప్రణవ్ చాగంటి సాహిత్యం అందించగా, యాజిన్ నిజార్ పాడారు. ఈ సందర్భంగా రాజా దారపనేని మాట్లాడుతూ.. ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన మా సినిమాలో వినోదంతో పాటు మంచి ప్రేమకథ ఉంది. మా చిత్రాన్ని నైజాంలో ఏషియన్ సునీల్‌గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు’’ అన్నారు. దయానంద్ గడ్డం మాట్లాడుతూ– ‘‘మా సినిమా ప్రేక్షకులను కాలేజ్ డేస్‌లోకి తీసుకెళ్లి, అప్పటి ఆ రోజులను గుర్తు చేస్తుంది’’ అన్నారు. మూడుసార్లు మౌత్ వాష్వర్జిన్ బాయ్స్‌లో నటించేందుకు బిగ్‌బాస్ బ్యూటీ సిరి అభ్యంతరం చెప్పలేదా? అని శ్రీహాన్‌కు ప్రశ్న ఎదురైంది. అందుకు శ్రీహాన్ స్పందిస్తూ.... సినిమాల విషయంలో మేము ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటాం. ఎన్నడూ ఎలాంటి అభ్యంతరాలు రాలేవు. కాకపోతే ఈ సినిమాలో లిప్‌లాక్ సీన్ షూటింగ్ అయ్యాక సిరి నాతో రెండుమూడుసార్లు మౌత్‌వాష్ చేయించింది అని చెప్పుకొచ్చాడు. సిరి- శ్రీహాన్ చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే! ఇక ఈ ఈవెంట్లో నిర్మాత రాజా దారపునేని.. బోల్డ్ బ్యూటీ అరియానా గ్లోరీతో కలిసి స్టేజీపై చిందేశాడు. చదవండి: నేను చెప్పానా.. జనాల్ని ఎలా ఫూల్స్ చేశారో చూశారా?: సింగర్ -
మిత్రా శర్మ ‘వర్జిన్ బాయ్స్’ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
Virgin Boys Teaser: యూత్‌ని ఆకట్టుకునేలా ‘వర్జిన్ బాయ్స్’ టీజర్
‘వర్జిన్ బాయ్స్’ టీజర్ విడుదలైంది. గీతానంద్, మిత్రా శర్మ జంటగా నటిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీలో శ్రీహాన్, రోనీత్, జెన్నిఫర్, అన్షుల, సుజిత్ కుమార్, అభిలాష్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దయానంద్ దర్శకత్వంలో రాజా దరపునేని నిర్మాణంలో రాజ్‌గురు ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందింది.టీజర్లో యూత్‌ఫుల్ ఎనర్జీ, కలర్‌ఫుల్ విజువల్స్, ఫ్రెష్ వైబ్స్ ఆకట్టుకుంటున్నాయి. స్మరణ్ సాయి సంగీతం టీజర్‌కు జోష్‌ను జోడించగా, వెంకట ప్రసాద్ సినిమాటోగ్రఫీ ఎనర్జిటిక్‌గా ఉంది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ టీజర్‌ను క్రిస్పీగా, ఆకర్షణీయంగా మలిచింది. గీతానంద్, మిత్రా శర్మ కెమిస్ట్రీ టీజర్లో హైలైట్‌గా నిలుస్తుంది. హాస్యం, రొమాన్స్, ఎమోషన్స్‌తో నిండిన ఈ కథ ఆధునిక రిలేషన్‌షిప్స్‌ను సరికొత్త శైలిలో చూపించనుంది. బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్ కామెడీ టైమింగ్, క్యారెక్టర్ టీజర్లో సందడి చేస్తున్నాయి, ఇంకా ఎక్కువ ఫన్ను సినిమాలో ఆశించవచ్చని తెలుస్తోంది. డైలాగ్స్, సీన్స్‌లో ఫన్ ఎలిమెంట్స్ యూత్‌ను ఆకర్షిస్తున్నాయి. ఈ సమ్మర్లో ‘వర్జిన్ బాయ్స్’ థియేటర్లలో యూత్‌ను అలరించే ఫుల్ ఎంటర్టైనర్గా నిలవనుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు.నిర్మాత రాజా దరపునేని మాట్లాడుతూ, "‘వర్జిన్ బాయ్స్’ యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. గతంలో వచ్చిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్‌ను మించేలా, రొటీన్‌కు భిన్నంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. యూత్ ఈ సినిమాతో తప్పకుండా రిలేట్ అవుతారు," అని అన్నారు.