
గీతానంద్, మిత్రా శర్మ, శ్రీహాన్ (Shrihan), జెన్నీఫర్ ఇమాన్యుయేల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ‘వర్జిన్ బాయ్స్’. దయానంద్ గడ్డం దర్శకత్వంలో రాజా దారపునేని నిర్మించిన ఈ సినిమా జూలై 11న విడుదల కానుంది. స్మరణ్ సాయి సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘దం దిగ దం...’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు.
కాలేజ్ డేస్‌లోకి..
ఈ పాటకి ప్రణవ్ చాగంటి సాహిత్యం అందించగా, యాజిన్ నిజార్ పాడారు. ఈ సందర్భంగా రాజా దారపనేని మాట్లాడుతూ.. ‘‘యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన మా సినిమాలో వినోదంతో పాటు మంచి ప్రేమకథ ఉంది. మా చిత్రాన్ని నైజాంలో ఏషియన్ సునీల్‌గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు’’ అన్నారు. దయానంద్ గడ్డం మాట్లాడుతూ– ‘‘మా సినిమా ప్రేక్షకులను కాలేజ్ డేస్‌లోకి తీసుకెళ్లి, అప్పటి ఆ రోజులను గుర్తు చేస్తుంది’’ అన్నారు.
మూడుసార్లు మౌత్ వాష్
వర్జిన్ బాయ్స్‌లో నటించేందుకు బిగ్‌బాస్ బ్యూటీ సిరి అభ్యంతరం చెప్పలేదా? అని శ్రీహాన్‌కు ప్రశ్న ఎదురైంది. అందుకు శ్రీహాన్ స్పందిస్తూ.... సినిమాల విషయంలో మేము ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటాం. ఎన్నడూ ఎలాంటి అభ్యంతరాలు రాలేవు. కాకపోతే ఈ సినిమాలో లిప్‌లాక్ సీన్ షూటింగ్ అయ్యాక సిరి నాతో రెండుమూడుసార్లు మౌత్‌వాష్ చేయించింది అని చెప్పుకొచ్చాడు. సిరి- శ్రీహాన్ చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే! ఇక ఈ ఈవెంట్‌లో నిర్మాత రాజా దారపునేని.. బోల్డ్ బ్యూటీ అరియానా గ్లోరీతో కలిసి స్టేజీపై చిందేశాడు.
చదవండి: నేను చెప్పానా.. జనాల్ని ఎలా ఫూల్స్ చేశారో చూశారా?: సింగర్