
బిగ్బాస్ ఫేం మిత్ర శర్మ శ్రీహాన్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం వర్జిన్ బాయ్స్. గేమ్ ఆన్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న గీత్ ఆనంద్, జెనీఫర్ ఇమాన్యుయల్, వంటి వారు ఇతర కీలకపాత్రలలో నటించిన ఈ సినిమాని గేమ్ ఆన్ డైరెక్టర్ దయానంద్ డైరెక్ట్ చేశాడు. రాజా దారపునేని నిర్మించిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫైనల్లీ నేడు(జులై 11) ఈ సినిమా ధియేటర్లలోకి వచ్చేసింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం
కథేంటంటే..
డూండీ (శ్రీహాన్), ఆర్య (గీత ఆనంద్), రోని(రోనిత్ రెడ్డి) ఒక యూనివర్సిటీలో కలిసి చదువుకుంటూ ఉంటారు. ఎలా అయినా వర్జినిటీ కోల్పోవాలని తహతహలాడుతున్న వీరికి వీరి ఫ్రెండ్ (కౌశల్) ఒక ఛాలెంజ్ ఇస్తాడు. తాను మళ్ళీ అమెరికా వెళ్లి వచ్చేటప్పటికి మీరంతా వర్జినిటీ కోల్పోవాలని ఛాలెంజ్ చేస్తాడు. ఎలాగైనా వర్జినిటీ కోల్పోవాలని ఉద్దేశంతో శ్రీహాన్ జెనీఫర్ ను, గీత్ ఆనంద్ మిత్ర శర్మను, రోనిత్ రెడ్డి అన్షులా ధావన్ను ప్రేమిస్తారు. వర్జినిటీ కోల్పోవడానికి వీరితో ప్రేమలో పడిన ముగ్గురు వర్జినిటీ కోల్పోయారా? ఛాలెంజ్లో గెలిచారా? చివరికి ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే
ఎలా ఉందంటే
ఓ ముగ్గురు కాలేజీ కుర్రాళ్ళు వర్జినిటీ కోల్పోవడానికి చేసే పోరాటమే ఈ కథ. కథలో కొత్తదనం లేదు కానీ తనదైన శైలిలో నవ్విస్తూ ఎంగేజ్ చేసేలా రాసుకోవడంలో దర్శకుడు కొంతవరకు సక్సెస్ అయ్యాడు. సెక్స్ ముఖ్యమని భావించి దాని వెనుకబడి తర్వాత ప్రేమ మాధుర్యాన్ని చవిచూసి, ప్రేమే గొప్పదని ఒప్పుకునే లైన్తో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. వర్జిన్ బాయ్స్ కథ కూడా
అదే లైన్ లో రాసుకున్నాడు దర్శకుడు. కాకపోతే నేటి యూత్ ను టార్గెట్ చేసుకొని వారిని ఎంగేజ్ చేసేలా చాలా సీన్స్ రాసుకోవడంతో కొంతవరకు యూత్ ఆడియన్స్ కి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. సినిమా ఓపెనింగ్ నుంచి చివరి వరకు ప్రేక్షకులకు ఎక్కడా కొత్తదనం కనిపించకపోయినా కొన్నిచోట బోల్డ్ జోక్స్, అమ్మాయిల అందాలతో కనివిందు చేస్తూ చాలావరకు సినిమా నడిపించే ప్రయత్నం చేశారు
ఒక ముగ్గురు యువకులు నగ్నంగా రోడ్డు మీద పరిగెత్తే సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది.ఆ తర్వాత ఈ ముగ్గురి క్యారెక్టర్ లోని ఎస్టాబ్లిష్ చేస్తూ కథనం సాగుతుంది. అమ్మాయిల చేతిని తాకితేనే ఎంతో అదృష్టం అని భావించే ముగ్గురు యువకులు న్యూ ఇయర్ రోజుకి వర్జినిటీ కోల్పోవాలని లక్ష్యంతో ముగ్గురు అమ్మాయిలతో ప్రేమలో పడటం, వారితో ప్రేమ కయ్యాలు ఇలా ఆసక్తికరంగా సాగుతుంది. ఇంటర్వెల్లో ఏదో ట్విస్ట్ ఇచ్చిన ఫీలింగ్ ఇస్తారు కానీ అదేమీ ఉండదు, సెకండాఫ్ మొదలయ్యాక వీరి ప్రేమ మీద అనుమానాలు తర్వాత మళ్లీ కలిసేందుకు ప్రయత్నాలు అంటూ రొటీన్ గానే సాగుతుంది చివరలో ఒక మంచి మెసేజ్ తో సినిమాని క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు.
ఎవరు ఎలా చేశారంటే..
ఈ సినిమాలో శ్రీహాన్ పాత్ర అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది ఎందుకంటే మన కాలేజీలలో ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి వ్యక్తులను మనం చూసే ఉంటాం. ఈ పాత్రలో శ్రీహాన్ ఒదిగిపోయాడు.తర్వాత కొంతవరకు గీత్ ఆనంద్ పాత్ర కన్వెన్సింగ్ గా ఉంటుంది. మిత్ర శర్మ పద్ధతి అయిన అమ్మాయి పాత్రలో ఆకట్టుకుంది. జెనీఫర్ అన్షుల ఒకపక్క అందాలు ఆరబోస్తూనే అభినయంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక మిగతా పాత్రధారులు అందరూ తమ పాత్ర పరిధి మేరకు పరవాలేదు అనిపించారు. సినిమాటోగ్రఫీ బాగుంది సంగీతం పర్వాలేదు నేపథ్య సంగీతం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది నిర్మాణ విలువలు బాగున్నాయి ఎడిటింగ్ సినిమాకి సరిపోయేలా కట్ చేశారు.
రేటింగ్: 2.75/5